ఆర్బీకేల్లో అవసరమైన యంత్రాలు.. జగన్ ఆలోచన మంచిదే కానీ..!

గుంటూరు చుట్టుగుంట సెంటర్లో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అందించారు సీఎం జగన్. వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు.

Advertisement
Update:2023-06-02 13:16 IST

ఏపీలో ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించి ప్రతి కార్యక్రమం అక్కడినుంచే జరిగేలా వాటిని రూపొందించారు.ధాన్యం సేకరణ కూడా రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలోనే జరిగింది. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ పనిముట్లను నామ మాత్రపు రుసుముతో అందిస్తున్నారు. వీటితోపాటు ఇప్పుడు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను కూడా రైతుల ముందుకు తెచ్చారు.

గుంటూరు చుట్టుగుంట సెంటర్లో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అందించారు సీఎం జగన్. వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం జగన్‌ పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం రైతులకు అందించారు. రైతన్నల గ్రూప్‌ ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు.


Full View

రైతు గ్రూప్ లకు, ఆర్బీకేలకు వ్యవసాయ పనిముట్లను అందించడం బాగానే ఉంది కానీ, వాటి నిర్వహణ విషయంలో అధికారులు అంతే సీరియస్ గా ఉంటే మాత్రం ఈ విధానం విజయవంతమవుతుంది. ప్రభుత్వ పనిముట్లే కదా అని వాటిని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించినా, నిర్వహణ లోపం ఉన్నా.. పథకం తాలూకు అంతిమ ఫలితాలు సన్న, చిన్నకారు రైతులకు అందవు. ప్రతీ ఆర్బీకే సెంటర్‌ లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లతోపాటు వారికి ఏమి అవసరమో వాటినే అడిగి మరీ అందజేస్తామంటున్నారు సీఎం జగన్. వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారాయన. రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని, రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని చెప్పారు. ఆర్బీకేల ద్వారా పనిముట్లు, యంత్ర సామగ్రి అందించడం అభినందనీయమే. అయితే ఈ పథకం అమలులో కూడా అంతే పారదర్శకత ఉంటే మాత్రం రైతు రాజ్యం వచ్చినట్టే లెక్క.

Tags:    
Advertisement

Similar News