లండన్ ఎయిర్ పోర్ట్ లో జై జగన్ నినాదాలు

ఆయన చేతిలో ఎరుపు రంగు స్వెట్టర్ ఉంది. చిరు నవ్వుతో జగన్ ఎయిర్ పోర్ట్ లో ఉల్లాసంగా కనిపించారు.

Advertisement
Update:2024-05-18 14:51 IST

ఏపీ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయన దిగగానే.. అక్కడ కూడా జై జగన్ నినాదాలు మారుమోగాయి. ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైట్ షర్ట్, క్రీమ్ కలర్ ఫ్యాంట్ తో ఎయిర్ పోర్ట్ లో జగన్ నడుస్తూ వచ్చారు. ఆయన చేతిలో ఎరుపు రంగు స్వెట్టర్ ఉంది. చిరు నవ్వుతో జగన్ ఎయిర్ పోర్ట్ లో ఉల్లాసంగా కనిపించారు.


శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి జగన్ విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి లండన్ వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్టు.. ఇతర వైసీపీ నేతలు ఆయనకు సెండాఫ్ ఇచ్చారు. లండన్ పర్యటన ముగించుకుని ఈ నెల 31న జగన్ తిరిగి విజయవాడకు చేరుకుంటారు.

ఇక సీఎం జగన్ పర్యటన సందర్భంగా డాక్టర్ తుళ్లూరు లోకేష్ అనే వ్యక్తిని పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. జగన్ పర్యటనకు బయలుదేరే సమయంలో లోకేష్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నారని, ఎవరికో కొన్ని మెసేజ్ లు పెట్టారని అంటున్నారు. పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్న సమయంలో గుండెపోటు అంటూ కుప్పకూలిపోయారని, ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారని చెబుతున్నారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో టీడీపీకి అనుకూలంగా తుళ్లూరు లోకేష్ మాట్లాడరనే వార్తలు కూడా వినపడుతున్నాయి. పోలీసులు అసలు లోకేష్ ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఆయనకు జగన్ పర్యటనకు సంబంధం ఏంటనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News