విదేశాలకు వెళ్తాం.. అనుమతివ్వండి.. సీబీఐ కోర్టును కోరిన జగన్
ఈనెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత జూన్ 3 వరకు ఫలితాలు వచ్చేది లేదు. అందుకే ఈలోగా విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.
ఈనెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళతామని, అందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లాలనుకుంటున్నామని, అందుకు పర్మిషన్ కావాలని అభ్యర్థించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
ఎన్నికల తర్వాత..
ఈనెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత జూన్ 3 వరకు ఫలితాలు వచ్చేది లేదు. అందుకే ఈలోగా విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. విదేశాల్లో చదువుకుంటున్న తన ఇద్దరు కుమార్తెలను కలిసి గడపాలని జగన్ దంపతులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
బిడ్డల్ని కలవడానికి వెళుతున్నా ట్రోలింగేనా?
అయితే సీఎం విదేశీ పర్యటనపైనా టీడీపీ ట్రోలింగ్ మొదలుపెట్టింది. ఆయన ఎన్నికల్లో ఓటమి భయంతోనే విదేశాలకు వెళ్లిపోతున్నారని సోషల్ మీడియాలోదారుణంగా కామెంట్లు పెడుతున్నారు టీడీపీ బ్యాచ్. బిడ్డల్ని కలుసుకోవడానికి, కుటుంబంతో గడపడానికి సీఎం వెళ్లినా దాన్ని కూడా రాజకీయం చేస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.