ఏపీకి జగన్.. గన్నవరంలో ఘన స్వాగతం

ఈరోజు ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సీఎం జగన్, కుటుంబ సభ్యులు.. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు.

Advertisement
Update: 2024-06-01 02:16 GMT

15రోజుల విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబ సభ్యులతో సహా సీఎం జగన్ కాసేపటి క్రితం రాష్ట్రంలో అడుగు పెట్టారు. ప్రత్యేక విమానంలో నేరుగా ఆయన గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు. సీఎం సీఎం అనే నినాదాలతో ఎయిర్ పోర్ట్ పరిసరాలు మారుమోగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్‌ పెద్ద ఎత్తున తరలివచ్చింది.


తాడేపల్లి నివాసానికి జగన్..

ఈరోజు ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సీఎం జగన్, కుటుంబ సభ్యులు.. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే-17వ తేదీన సీఎం జగన్‌ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో పర్యటించారు. 15 రోజుల తర్వాత తిరిగి ఈరోజు స్వదేశానికి వచ్చారు.

కాసేపట్లో కీలక మీటింగ్..

ఏపీకి వచ్చినప్పటి నుంచి జగన్ సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడపబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఆయన కీలక నేతలతో భేటీ అవుతారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరోసారి పార్టీ నేతలకు ఆయన వివరిస్తారు. జగన్ రాకతో మళ్లీ తాడేపల్లి కార్యాలయం బిజీగా మారిపోయింది. 

Tags:    
Advertisement

Similar News