ఏపీలో పలుచోట్ల మద్యం డిస్ట్రిలరీల్లో సీఐడీ సోదాలు
డిస్ట్రలరీలకు ఎంతవరకు మద్యం సరఫరా చేశారనే విషయంపై ఆరా తీస్తున్న అధికారులు
Advertisement
ఏపీలో పలుచోట్ల మద్యం డిస్ట్రిలరీల్లో సీఐడీ సోదాలు చేపట్టింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పెద్దాపురం మండలం చిన బ్రహ్మదేవంలోని కేబీకే బయోటెక్ పరిశ్రమలో అధికారులు తనిఖీలు చేశారు.. పలు రికార్డులను పరిశీలించారు. నల్లజర్ల మండలం ఆవపాడు, రాయవరం మండలం చెల్లూరు, తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని డిస్ట్రిలరీల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై వివరాలు సేకరిస్తున్నారు. డిస్ట్రలరీలకు ఎంతవరకు మద్యం సరఫరా చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Advertisement