మళ్లీ డైవర్షన్ గేమ్.. సీఎస్ కు చంద్రబాబు లేఖ

బ్యాంకుల ముందు వృద్ధులు అవస్థలు పడటానికి కారణం అయిన చంద్రబాబు, తిరిగి ఆ సమస్యను తానే హైలైట్ చేస్తున్నట్టు సీఎస్ కి లేఖ రాయడం దేనికి..?

Advertisement
Update:2024-05-03 17:03 IST

ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. గత నెలలో సచివాలయాల వద్దకు వెెళ్లి పెన్షన్లు తీసుకున్నారు లబ్ధిదారులు. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పెన్షన్ల పంపిణీ మొదలై మూడు రోజులవుతున్నా.. నేటికీ బ్యాంకుల దగ్గర తెగబారెడు క్యూలైన్లు కనపడుతున్నాయి. కొంతమంది పరిస్థితి మరీ దారుణం. బ్యాంకులో పెన్షన్ పడిందో లేదో తెలియదు, సచివాలయ సిబ్బంది వచ్చి ఇస్తారో లేదో తెలియదు. ఇలాంటి వారంతా సరైన సమాచారం లేక నరకం అనుభవిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలో పెన్షన్ జమ అయినా.. కేవైసీ చేయించుకోని కారణంగా చాలామంది డబ్బు విత్ డ్రా చేసుకోలేకపోతున్నారు.

చంద్రబాబు చేసిన తప్పుకి రెండు నెలలుగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆగ్రహ జ్వాలల ఫలితం ఎన్నికల రోజున కచ్చితంగా కనపడుతుందని చంద్రబాబుకి కూడా అర్థమైంది. అందుకే ఆయన ప్రభుత్వాన్ని, అధికారుల్ని టార్గెట్ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా ఆయన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ లబ్ధిదారులు కష్టాలు పడుతున్నారని, అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే అవకాశాలను కనీసం ఆలోచించడం లేదని అన్నారాయన. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరం, అత్యంత దుర్మార్గమని చంద్రబాబు ఆరోపించారు.

ప్రతి నెలా ఒకటో తేదీ ఇంటికి వస్తున్న పెన్షన్ ని ఆపింది ఎవరు..? సమాధానం చంద్రబాబు.

గత నెలలో సచివాలయం వద్ద పెన్షన్ ఇస్తే ఆ పద్ధతి బాగోలేదన్నది ఎవరు..? సమాధానం చంద్రబాబు.

ఇప్పుడు బ్యాంకుల్లో పెన్షన్లు వేస్తే మళ్లీ నీతులు చెబుతోంది ఎవరు..? సమాధానం చంద్రబాబు..

అంటే ఇక్కడ అధికారులు చంద్రబాబు చెప్పినట్టల్లా చేయాలా..? బ్యాంకుల ముందు వృద్ధులు అవస్థలు పడటానికి కారణం అయిన చంద్రబాబు, తిరిగి ఆ సమస్యలను తానే హైలైట్ చేస్తున్నట్టు సీఎస్ కి లేఖ రాయడం దేనికి..? సింపతీ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని అంటున్నారు వైసీపీ నేతలు. వృద్ధుల ఉసురు పోసుకున్న పాపం పండుతుందని, ఆ ఫలితం కచ్చితంగా ఎన్నికల్లో కనపడుతుందని హెచ్చరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News