చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉంది.. - హౌస్ రిమాండ్ పిటిషన్‌లో లూథ్రా సంచలన వ్యాఖ్యలు
గతంలో సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐదుగురు మంత్రుల విషయంలో ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ కూడా అది వర్తిస్తుందని ఆయన చెబుతున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జైలులో ప్రాణహాని ఉందని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్ రిమాండ్ పిటిషన్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు రిమాండ్ కాలాన్ని గృహ నిర్బంధంలో ఉంచి కొనసాగించాల్సిందిగా కోరుతున్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలతో పిటిషన్ ఫైల్ చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
దీనిపై చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ.. గతంలో సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐదుగురు మంత్రుల విషయంలో ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ కూడా అది వర్తిస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ఆమోదిస్తుందా లేక తిరస్కరిస్తుందా అనేది వేచి చూడాలి.