83సార్లు సమీక్ష చేశా.. ఇదీ నా ట్రాక్ రికార్డ్

చంద్రబాబు తాను సందర్శించిన ప్రాజెక్ట్ ల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే సెల్ఫీలతో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.

Advertisement
Update:2023-08-07 19:50 IST

ప్రాజెక్ట్ లను సందర్శిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న చంద్రబాబుకి ఈ కార్యక్రమం రాజకీయంగా ఉపయోగపడకపోగా, ఆయన తప్పుల్ని మరోసారి ప్రజలకు గుర్తు చేసేలా ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా చంద్రబాబు పోలవరం సందర్శించారు. పోలవరం విషయంలో ఆయన వైఎస్ఆర్ ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల పోలవరం పదేళ్లు ఆలస్యమైందన్నారు చంద్రబాబు. హెడ్ వర్క్స్‌ నిర్లక్ష్యం చేసి కమీషన్ల కోసం కాలువ పనులపై దృష్టి పెట్టారని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కేవలం 5 శాతం పనులు మాత్రమే జరిగాయని విమర్శించారు. జగన్ వచ్చాక కమీషన్లకోసం కాంట్రాక్టర్లను మార్చారని, ఏడాదిన్నరపాటు ప్రధాన డ్యామ్ వద్ద పనులే జరగలేదన్నారు చంద్రబాబు.

సెల్ఫీ లతో సెల్ఫ్ గోల్..

చంద్రబాబు తాను సందర్శించిన ప్రాజెక్ట్ ల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే సెల్ఫీలతో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు సెల్ఫీల వల్ల అసలు ఆయన హయాంలో ఏం జరిగిందనే ప్రశ్న తలెత్తుతోందని, దానికి ఆయన వద్ద జవాబు లేదని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ లను పట్టించుకోని బాబు.. ఇప్పుడు హడావిడి చేయడమేంటని నిలదీస్తున్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారంటూ సాక్షాత్తూ ప్రధాని మోదీయే చెప్పారని, అంతకంటే ఇంకేం నిదర్శనం కావాలంటున్నారు.

83సార్లు సమీక్షలు చేశా..

గతంలో ప్రతి సోమవారం, పోలవారం అంటూ హడావిడి చేశారు చంద్రబాబు. అయితే ఆ హడావిడి వల్ల జరిగింది పని కాదని, కేవలం సమీక్షలేనని ఆయనే పరోక్షంగా ఇప్పుడు ఒప్పుకున్నట్టయింది. తాను అధికారంలో ఉన్నప్పుడు పోలవరంపై 83సార్లు సమీక్షలు చేపట్టానన్నారు చంద్రబాబు. ప్రతిపక్ష నేత హోదాలో ఈరోజు తొలిసారి పోలవరంను సందర్శించిన ఆయన, ఇది సున్నితమైన ప్రాజెక్ట్ అని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని, ఏపీ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. మొత్తమ్మీద తన హయాంలో జరిగింది పని కాదని, కేవలం సమీక్షలని బాబు పరోక్షంగా ఒప్పుకున్నారని నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News