ఆస్కార్, నోబెల్.. అన్నీ చంద్రబాబుకే

చంద్రబాబుకి అవినీతిలో నోబెల్, నటనలో ఆస్కార్ ఇవ్వాల్సిందేనన్నారు మంత్రి అమర్నాథ్. ఈ స్కామ్ లో లోకేష్ ప్రమేయం కూడా ఉందని, తండ్రీ కొడుకులు పంది కొక్కుల్లా ప్రజాధనం తినేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2023-03-21 12:33 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, విశ్లేషణ.. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు తెలివిగా డ్రామాలాడారని కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేశారని, షెల్ కంపెనీలకు తరలించి, తిరిగి తన వద్దకే చేర్చుకున్నారని సీఎం జగన్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుంభకోణాల్లో చంద్రబాబు ఎంత సిద్ధహస్తుడో చెప్పడానికి “నారా స్కిల్ స్కామ్” ఒక ఉదాహరణ అన్నారాయన. ఈ స్కామ్ లో కీలక నిందితులను ఈడీ విచారరణకు పిలిచిందని, చంద్రబు, లోకేష్ అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు.

అవినీతిలో నోబెల్, నటనలో ఆస్కార్..

చంద్రబాబుకి అవినీతిలో నోబెల్, నటనలో ఆస్కార్ ఇవ్వాల్సిందేనన్నారు మంత్రి అమర్నాథ్. ఈ స్కామ్ లో లోకేష్ ప్రమేయం కూడా ఉందని, తండ్రీ కొడుకులు పంది కొక్కుల్లా ప్రజాధనం తినేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమెన్స్ కంపెనీయే ఈ విషయం నిర్థారించిందన్నారు. ఏలేరు స్కామ్, స్టాంప్ పేపర్ల కుంభకోణం, హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు చంద్రబాబు హయం అంతా అవినీతి మయం అన్నారు మంత్రి అమర్నాథ్.

దమ్ముంటే పులివెందులలో పోటీకి రండి..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలో వైసీపీకి ఓట్లు పడలేదని, పులివెందులలో కూడా టీడీపీకి మెజార్టీ వచ్చిందని ఆపార్టీ చెప్పుకుంటోందని.. దమ్ముంటే లోకేష్ పులివెందుల వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు మంత్రి అమర్నాథ్. రాజధానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి సంబంధం లేదన్నారు. కేవలం 3శాతం ఓట్లు కలిగిన ఒక సెక్షన్ ఓటర్ల ప్రభావం సార్వత్రిక ఎన్నికల్ల పెద్దగా ఉండదన్నారు. పట్టభధ్రుల్లో అసంతృప్తికి గల కారణాలు విశ్లేషించుకుంటున్నామని చెప్పారు. లోపం ఎక్కడుందో పసిగట్టి మార్పులు చేసుకుంటామన్నారు. ఇండియా – కెన్యా మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే అప్పుడప్పుడు కెన్యా గెలుస్తుందని, అంత మాత్రాన కెన్యా బలమైన జట్టు అని చెప్పగలమా అని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.

Tags:    
Advertisement

Similar News