సీబీఐ చేతిలోకి వెళ్లిపోతోందా? చంద్రబాబుకు షాకేనా?

ఉండవల్లి పిటీషన్‌కు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తు ఆదేశాలు ఇవ్వటానికి కోర్టుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చని అనుకుంటున్నారు

Advertisement
Update:2023-11-11 10:31 IST

సీబీఐ చేతిలోకి వెళ్లిపోతోందా? చంద్రబాబుకు షాకేనా?

స్కిల్ స్కామ్ దర్యాప్తు తొందరలోనే సీబీఐ చేతిలోకి వెళ్లిపోతోందా? కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో జరిగిన పరిణామాలతో అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసు దర్యాప్తును సీఐడీ నుండి తప్పించి సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మాట్లాడుతూ.. కేసును సీబీఐకి అప్పగించటానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గతంలోనే కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి ఇవ్వటానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

అంటే పిటీషనర్ అడిగింది, ప్రభుత్వం చెప్పింది ఒకటే అన్న విషయం అర్థ‌మవుతోంది. ఉండవల్లి పిటీషన్‌కు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తు ఆదేశాలు ఇవ్వటానికి కోర్టుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చని అనుకుంటున్నారు. అదే జరిగితే చంద్రబాబునాయుడుకు షాకనే చెప్పాలి. రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న భారాన్ని దింపేసుకుని కేంద్రం మీద మోపుతున్నట్లే అనుకోవాలి.

కేసు దర్యాప్తు సీబీఐ పరిధిలోకి వెళిపోతే చంద్రబాబు జుట్టు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇరుక్కున్నట్లే. ఇప్పుడే రాజకీయంగా బీజేపీని ఏ విషయంలో కూడా నిలదీయలేని స్థితిలో ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రాపకం కోసం, బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ఏ కేసు లేనప్పుడే చంద్రబాబు ఇంతగా సాగిలపడుతున్నప్పుడు ఇక సీబీఐ దర్యాప్తు కూడా మొదలైతే చంద్రబాబు పరిస్థితి చెప్పాల్సిన పనేలేదు.

సీబీఐ దర్యాప్తును వ్యతిరేకించే అవకాశం టీడీపీకి లేకపోయినా దర్యాప్తు సీబీఐ చేతిలోకి ఎక్కడ వెళిపోతుందో అనే భయం వెంటాడుతోంది. ఎందుకంటే సీబీఐ దర్యాప్తున‌కు అప్పగించాలని ఉండవల్లి కోర్టులో పిటీషన్ వేసిన దగ్గర నుండి టీడీపీ మాజీ ఎంపీని ఎంతలా టార్గెట్ చేస్తోందో అందరు చూస్తున్నదే. వైసీపీ దగ్గర ప్యాకేజీ తీసుకున్నారని, తాడేపల్లి కుక్కని బుర్రకు తోచినట్లుగా సోషల్ మీడియాలో బాగా విరుచుకుపడుతోంది. సీబీఐ దర్యాప్తు అంటే టీడీపీ భయపడుతోందనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలి?

Tags:    
Advertisement

Similar News