బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్ట్ తప్పదా?

స్కిల్ స్కామ్‌లో బెయిల్ తెచ్చుకోవటం ఆలస్యం వెంటనే ఫైబర్ గ్రిడ్‌లో అరెస్టు చేస్తారు. అక్క‌డ‌ బెయిల్ తెచ్చుకుంటే రింగ్ రోడ్డు కుంభకోణంలో అరెస్టు తప్పదు. ఇందులో కూడా బెయిల్ తెచ్చుకుంటే అంగళ్ళ కేసులో అరెస్టుకు సిద్ధంగా ఉండాలి.

Advertisement
Update:2023-10-10 10:49 IST

క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం క‌లుగుతోంది. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు 32 రోజులుగా రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం వేసిన పిటీష‌న్‌ను ఏసీబీ కోర్టు రిజెక్ట్‌ చేసింది. అందుకనే మళ్ళీ బెయిల్ పిటీషన్‌ను హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. మూడు కేసులు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్ళు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ రిజెక్ట్ అయింది. సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటీషన్‌పై జరుగుతున్న విచారణ ఏమవుతుందో తెలియ‌దు.

ఇప్పుడు సమస్య ఏమిటంటే స్కిల్ స్కామ్‌లో ఎప్పటికైనా బెయిల్ వచ్చినా వెంటనే సీఐడీ, పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాగంటే పై మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాబట్టి ఈ కేసుల్లో చంద్రబాబును ఎప్పుడైనా అరెస్టు చేయచ్చు. స్కిల్ స్కామ్‌లో బెయిల్ తెచ్చుకోవటం ఆలస్యం వెంటనే ఫైబర్ గ్రిడ్‌లో అరెస్టు చేస్తారు. ఫైబర్ స్కామ్‌లో బెయిల్ తెచ్చుకుంటే రింగ్ రోడ్డు కుంభకోణంలో అరెస్టు తప్పదు. ఇందులో కూడా బెయిల్ తెచ్చుకుంటే అంగళ్ళ కేసులో అరెస్టుకు సిద్ధంగా ఉండాలి.

చంద్రబాబును అరెస్టు చేయటానికి ఇలా కేసు మీద కేసు రెడీగా ఉన్నాయి. ఇదే విషయమై న్యాయనిపుణులు మాట్లాడుతూ.. అన్నీ కేసుల నుండి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేందుకు కనీసం ఫిబ్రవరి అవుతుందంటున్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ కూడా డిస్మిస్ అవటానికే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు.

ఫిబ్రవరిలో బయటకొచ్చే అవకాశం ఉందంటే, ఎన్నికలకు ముందు మాత్రమే సంపూర్ణంగా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని స్పష్టంగా అర్థ‌మవుతోంది. నిజంగా ఇది వ్యక్తిగతంగా చంద్రబాబుతో పాటు టీడీపీకి చాలా ఇబ్బందులనే చెప్పాలి. ఎందుకంటే మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి వరకు బెయిల్ దొరకటం కష్టమంటే పొత్తులు, సీట్ల షేరింగ్, పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఫైనల్ చేయటం చాలా కష్టమైపోతుంది. ప్రచారం కూడా హడావుడిగా చేసేయాల్సి ఉంటుంది. అయితే తన పరిస్థితిని చంద్రబాబు సింపతీ కోసం వాడుకుంటారనటంలో సందేహంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.


Tags:    
Advertisement

Similar News