పోలవరం: జగన్ పై పెద్ద నిందే వేసిన బాబు

పోలవరం ప్రాజెక్ట్ సందర్శనం అనంతరం అందరూ అనుకున్నట్టుగానే గత ప్రభుత్వంపై తప్పు నెట్టేశారు చంద్రబాబు. పోలవరం కోసం తాను పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు.

Advertisement
Update:2024-06-17 17:37 IST

గత ప్రభుత్వ నిర్ల్యక్షంతో, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది.

మరమ్మతులు చేస్తే రూ.447 కోట్లు ఖర్చవుతుంది.

అయినా బాగవుతుందని నమ్మకం లేదు.

సమాంతరంగా మళ్లీ డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది.

సీఎం చంద్రబాబు ఈరోజు జగన్ పై వేసిన నిందలు ఇవి. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనం అనంతరం అందరూ అనుకున్నట్టుగానే గత ప్రభుత్వంపై తప్పు నెట్టేశారు చంద్రబాబు. పోలవరం కోసం తాను పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు. టీడీపీ హయాంలోనే 72 శాతం పనులు పూర్తయ్యాయని, 15 లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్ వే పైనుంచి డిశ్చార్జ్ అయ్యేలా చేశామని వివరించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యేదని, ఇప్పుడది నాలుగేళ్లు గడిచినా పూర్తవుతుందనే నమ్మకం లేదన్నారు చంద్రబాబు.


ప్రాజెక్ట్ నిర్మాణ ఏజెన్సీలను మార్చడం వల్లే పోలవరం ఆలస్యమైందన్నారు చంద్రబాబు. డయాఫ్రమ్ వాల్ ని గత ప్రభుత్వం కాపాడుకోలేదని, అందుకే అది ధ్వంసమైందని అన్నారు. అదిప్పుడు రిపేర్ చేయాలన్నా కష్టమని అన్నారు చంద్రబాబు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారన్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల గురించి జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. 

Tags:    
Advertisement

Similar News