మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

Advertisement
Update:2024-12-27 15:25 IST

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దేశం గొప్ప ఆర్ధిక సంస్కర్తను కోల్పోయిందని ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. గ్రామీణ ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని తెలిపారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు.

Tags:    
Advertisement

Similar News