ఎంపీడీవోపై వైసీపీ నేత దాడి

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.

Advertisement
Update:2024-12-27 17:56 IST

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గాలీవీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్‌రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను కోరాడు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని ఎంపీడీవో తెలిపారు. దీంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఎంపీడీవో జవహర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన ఎంపీడీవోను రాయచోటి ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఎంపీడీవోపై దాడి చేసిన సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుదర్శన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. తనపై దాడి జరిగిన తీరును ఎంపీడీవో జవహర్‌బాబు మీడియాకు వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గది తాళాలు ఇవ్వనందుకు సుదర్శన్ రెడ్డి, ఆయన 20 మంది అరుచరులు నా మీద మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని వాపోయారు. అడ్డొచ్చిన నా మేనల్లుడిని కూడా కొట్టారు. దాడి తర్వాత అరగంట పాటు కార్యాలయంలోనే ఉన్నారు. ఇవాళ రాత్రిలోగా నన్ను చంపేస్తామని సుదర్శన్ రెడ్డి హెచ్చరించాడని ఎంపీడీవో అన్నారు.

Tags:    
Advertisement

Similar News