చంద్రబాబు చెప్పుకునేది కొండంత.. జగన్ చేసేది కొండంత
చంద్రబాబు పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు. జగన్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలతో పోలిస్తే అవి లెక్కలోకి కూడా రావు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే లక్షా 40 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాలు కల్పించింది.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసేది గోరంత, చెప్పుకునేది కొండంత. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసేది కొండంత, ప్రచారం చేసుకునేది గోరంత. ఈ వ్యత్యాసం ఎందుకు ఉంది..? చంద్రబాబుకు ప్రజల మీద నమ్మకం లేదు. దానికితోడు ఎంతగా చెప్పుకుంటే అంతగా తనకు మద్దతు లభిస్తుందనే తప్పుడు అవగాహన. వైఎస్ జగన్‌కు ప్రజల మీద నమ్మకం. తాను మేలు చేస్తే ప్రజలు తనను విస్మరించరనేది ఆయన ఆలోచన.
అయితే, జగన్ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదని ప్రచారం చేయడానికి టిడిపి నేతలు, ఎల్లో మీడియా యజమానులు రాష్ట్రమంతా నోరు చేసుకుని అరుస్తున్నారు. అందుకే జగన్ పాలనలో జరిగిన పనులను చెప్పాల్సి వస్తోంది. జగన్ పాలనలో ఉద్యోగాల కల్పనపై టిడిపి, ఎల్లో మీడియా అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నాయి. జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉద్యోగాల కల్పనపై కాస్తా మాట్లాడుకుందాం.
చంద్రబాబు పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు. జగన్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలతో పోలిస్తే అవి లెక్కలోకి కూడా రావు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే లక్షా 40 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాలు కల్పించింది. ఇతర శాఖల్లో కల్పించిన ఉద్యోగాలతో కలిపితే జగన్ హయాంలో 2 లక్షల 14 వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగింది. వాటికి తోడు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అన్నీ కలిపితే జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో 6 లక్షల 32 వేల ఉద్యోగాలు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కల్పించింది.
జగన్ నాలుగేళ్ల పాలనలో 16 లక్షల వరకు పీఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి స్వయంగా చెప్పారు. 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈపీఎఫ్ ఖాతాలు 45 లక్షలు ఉంటే, అవి 2022-23 నాటికి 61 లక్షలకు పెరిగాయి. ఈ లెక్కన చూస్తే 16 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు. చంద్రబాబు పాలనలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా..?