చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన రూట్ ఖరారు
ఆగస్టు 2న కొండాపూర్ ప్రాజెక్టు సందర్శించిన అనంతరం పులివెందులలో చంద్రబాబు రోడ్ షో చేపట్టనున్నారు. పూలఅంగళ్ల సర్కిల్‌లో చంద్రబాబు బహిరంగ సభ కూడా ఉంటుందని టీడీపీ ప్రకటించింది.
ఇటీవల సాగునీటి ప్రాజెక్టులపై వరుసగా ప్రజంటేషన్లు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. త్వరలో ప్రాజెక్టుల వద్ద నుంచే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ప్రకటించారు. చెప్పినట్టే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన రూట్ మ్యాప్ ఖరారు అయ్యింది. మంగళవారం (ఆగస్టు 1వ తేదీ) ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. అదేరోజు మచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించనున్నారు.
ఆగస్టు 2న కొండాపూర్ ప్రాజెక్టు సందర్శించిన అనంతరం పులివెందులలో చంద్రబాబు రోడ్ షో చేపట్టనున్నారు. పూలఅంగళ్ల సర్కిల్‌లో చంద్రబాబు బహిరంగ సభ కూడా ఉంటుందని టీడీపీ ప్రకటించింది. ఆగస్ట్ 3న ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్ పరిశీలించనున్నారు. అదే రోజు కియా కార్ల పరిశ్రమను సందర్శించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా నాలుగోరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్ కెనాల్ పరిశీలించిన అనంతరం పూతలపట్టులో రోడ్ షో, బహిరంగ సభని ప్లాన్ చేశారు.
మొదటి రోజు కర్నూల్, రెండో రోజు కడప, మూడో రోజు అనంతపురం, నాలుగో రోజు చిత్తూరు జిల్లాల్లో టూర్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఎటువంటి విరామం లేకుండా మిగిలిన జిల్లాలలోని సాగునీటి ప్రాజెక్టు ల వద్దకు నారా చంద్రబాబు చేరుకుని పరిశీలించనున్నారు.