పెయిడ్ బ్యాచులను ఆహ్వానించిన చంద్రబాబు
పార్టీ వాళ్ళే కాకుండా తమకు మద్దతుగా జనరల్ పబ్లిక్ ను కూడా వాడుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఇందుకోసం తమకు తగ్గట్లుగా కంటెంట్ ను అందించే ఏజెన్సీలకు, ప్రజలకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలన్నది చంద్రబాబు పట్టుదల. ఒకవేళ 2024 ఎన్నికల్లో కూడా ఓడిపోతే వ్యక్తిగతంగా తనతో పాటు టీడీపీకి ఎలాంటి పరిస్ధితి ఎదురవుతుందో బాగా తెలుసు. అందుకనే అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అనుసరిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ మీడియాను చేతిలో పెట్టుకుని తనకు కావాల్సినట్లు ప్రచారం చేయించుకుంటున్నారు. దీనికి అదనంగా సోషల్ మీడియాలో కూడా పెయిడ్ బ్యాచ్ లను దింపాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే పార్టీలకు అనుబంధంగా సోషల్ మీడియాలో చాలా వేదికలే ఉన్నాయి. అవన్నీ డైరెక్టుగానో లేకపోతే ఇన్ డైరెక్టుగానో పార్టీలకు పనిచేస్తున్నాయి. అయితే అవి సరిపోవన్నట్లుగా ప్రతి నియోజక వర్గానికి ఒక సోషల్ మీడియా వింగ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వేదికలను ఎన్ని వీలైతే అన్ని రెడీ చేసుకోవాలని నేతలకు చెప్పారు. సోషల్ మీడియా వేదికలను రెడీ చేసుకోవటమే కాకుండా టీడీపీకి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటెంట్ తయారుచేసే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
పార్టీ వాళ్ళే కాకుండా తమకు మద్దతుగా జనరల్ పబ్లిక్ ను కూడా వాడుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఇందుకోసం తమకు తగ్గట్లుగా కంటెంట్ ను అందించే ఏజెన్సీలకు, ప్రజలకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ తరపున ఒక విస్తృతమైన వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీనికోసం అందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత రోజుల్లో మీడియా కన్నా సోషల్ మీడియాకే ప్రాధాన్యత బాగా పెరిగిపోయిన విషయం అందరు గమనిస్తున్నదే. మీడియా పార్టీలవారీగా చీలిపోయిన కారణంగా తాము చూపించదలచుకున్న కోణంలో మాత్రమే వార్తలు, కథనాలు అందిస్తున్నది. అదే సోషల్ మీడియా అయితే నాణేనికి రెండువైపులా చూపిస్తోంది. దాంతో జనాలు ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళు చూసుకుని ఏమి జరుగుతోందో విశ్లేషించుకుంటున్నారు. ఇలాంటి వేదికను కూడా చంద్రబాబు డబ్బులిచ్చి మరీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటున్నారు.