ఎన్డీఏకు ఎన్ని సీట్లు వస్తాయంటే..? వారణాసిలో చంద్రబాబు
ఏపీలో ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ వారణాసి వెళ్లారు, మోదీ నామినేషన్ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు.
"నిన్ననే మా రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి, అక్కడ మేం క్లీన్ స్వీప్ చేస్తున్నాం. 100 శాతం ఎన్డీఏ కూటమి గెలుస్తుంది." అని చెప్పారు చంద్రబాబు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమం కోసం వారణాసి వెళ్లిన ఆయన.. బీజేపీ నేతలతో కలసి బస్సులో ప్రయాణించారు. ఏపీలో కూటమి విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు బాబు.
400 ప్లస్..
ఇక దేశవ్యాప్తంగా బీజేపీ కూటమి ఘన విజయం సాధించబోతుందని అన్నారు చంద్రబాబు. ఎన్డీఏలోని పార్టీలకు 400కి పైగా స్థానాలు వస్తాయన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం గ్యారెంటీ అని అన్నారు. మోదీ చేసిన మంచి పనులు ఆయన విజయానికి కారణం అవుతున్నాయని చెప్పారు. వారణాసి పవిత్ర స్థలం అని, మోదీ నామినేషన్ ఓ చారిత్రక ఘట్టం అని అన్నారు చంద్రబాబు.
ఏపీలో ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ వారణాసి వెళ్లారు, మోదీ నామినేషన్ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు. బీజేపీ నేతలతో కలసి వారు సందడి చేస్తున్నారు. బీజేపీ నేతలకంటే ఎక్కువగా మోదీని పొగిడేస్తున్నారు బాబు, పవన్. గతంలో మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన బాబు, ఇప్పుడు ఆయన్ను ఆకాశానికెత్తేయడం విశేషం. పదేళ్లుగా మోదీ అద్భుతమైన పాలన అందించారని, అందుకే ఆయన మరోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు బాబు.