వివేకానే చంద్రబాబు నమ్ముకున్నారా?

రాబోయే ఎన్నికల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసును ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే వివేకా మర్డర్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకు జరిగిన డెవలప్‌మెంట్‌తో ప్రత్యేకంగా ‘వివేకానందరెడ్డికి న్యాయం.ఇన్’ అనే వెబ్ సైట్ ఏర్పాటు చేశారు.

Advertisement
Update:2023-07-28 10:49 IST

చంద్రబాబునాయుడు రాజకీయం మొత్తంలో సొంత బలం అన్నది ఎక్కడా కనబడదు. ఎప్పుడు చూసినా ప్రత్యర్థుల బలహీనతలను తన బలంగా మార్చుకోవటమే కనబడుతుంది. ఎలాగూ ఎల్లో మీడియా దన్నుంది కాబట్టి ప్రత్యర్థులపై బాగా బురదచల్లేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టి లాభపడేవారు. 2014 ఎన్నికల వరకు ఇదే పద్ధ‌తిని అనుసరించారు. అయితే అక్కడి నుండే వ్యూహాలు తిరగబడటం మొదలైంది. అందుకనే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అయినా చంద్రబాబు వ్యూహం మార్చుకోలేదని అర్థ‌మవుతోంది.

ఎలాగంటే రాబోయే ఎన్నికల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసును ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే వివేకా మర్డర్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకు జరిగిన డెవలప్‌మెంట్‌తో ప్రత్యేకంగా ‘వివేకానందరెడ్డికి న్యాయం.ఇన్’ అనే వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. ఇందులో వివేకా హత్యకు గురైన దగ్గర నుండి నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యులు చెప్పింది. సునీత, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి తదితరులు చెప్పిన విషయాలున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనలు తదితరాలను ఉంచారు.

వివేకా మర్డర్ కేసుపై ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేయటంలో ఉద్దేశం ఏమిటంటే జగన్ అండ్ కో పైన బురదచల్లటమే అని అర్థ‌మవుతోంది. జగన్, అవినాష్, భాస్కరరెడ్డిలను వివేకా హత్యలో కీలక పాత్రలుగా చిత్రీకరించటమే టార్గెట్. ఈ వెబ్ సైట్‌లో సునీత రెడ్డి మార్చిన స్టేట్‌మెంట్లు, వివేకా కుంటుంబ సభ్యులపై అనుమానాలను, రెండో భార్య షమీమ్ వ్యవహారాలు ఏవీ లేవు. పైగా వెబ్ సైట్ అంతా ఎల్లో మీడియా కథనాలతోనే నిండిపోయింది. హత్యకేసు దర్యాప్తులో సీబీఐ చేసిన తప్పులు, కోర్టు విచారణలో సీబీఐని జస్టిస్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నల్లాంటివి ఏవీ లేవు.

వివేకా మర్డర్ కేసును రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా ప్రచారం చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. నిజానికి వివేకా మర్డర్ ఘటన కడప మినహా మరే జిల్లాల్లో కూడా రాజకీయంగా పెద్దగా చర్చనీయాంశం కాలేదు. ఎందుకంటే బతికున్నంతకాలం అన్న వైఎస్సార్ పేరుతోను ఆయన చనిపోయిన తర్వాత జగన్ పేరు మీద మాత్రమే వివేకా చెలామణి అయ్యారు. వివేకాకి అంటు సొంత అస్థిత్వమే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. మరి వివేకా కేసు రాష్ట్రం మొత్తం ఎలా ప్రభావితం చేయగలదని చంద్రబాబు అనుకున్నారో అర్థంకావటంలేదు.

Tags:    
Advertisement

Similar News