ఎట్టకేలకు చంద్రబాబుకి మొదలైన వైద్యం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?
నిజంగానే ఆరోగ్యం బాగోలేకపోతే జైలునుంచి విడుదలైన వెంటనే చంద్రబాబు నేరుగా ఆస్పత్రికి వెళ్లాలి. కానీ జైత్రయాత్రలాగా ఏపీలోని ఇంటికి, ఆ తర్వాత తెలంగాణలోని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన్ను వైద్యుల బృందం కలిసి పరీక్షలు నిర్వహించింది.
ఆరోగ్యం బాలేదు, అర్జంట్ గా వైద్యం కావాలి, వెంటనే కంటి ఆపరేషన్ చేయించుకోవాలి.. అంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ పెట్టుకుని బెయిల్ తెచ్చుకున్నారు. అయితే జైలు నుంచి విడుదలైన 24గంటల తర్వాతే ఆయనను వైద్యుల బృందం కలవడం విశేషం. దాదాపుగా ఒకరోజంతా ఆయన తన ప్రయాణాన్ని విజయోత్సవంలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. దాన్ని ఎల్లోమీడియా మరింత హైలైట్ చేసింది. ఆరోగ్యం బాగోలేకపోతే జైలునుంచి విడుదలైన వెంటనే ఆయన నేరుగా ఆస్పత్రికి వెళ్లాల్సింది. కానీ జైత్రయాత్రలాగా ఏపీలోని ఇంటికి, ఆ తర్వాత తెలంగాణలోని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన్ను వైద్యుల బృందం కలిసి పరీక్షలు నిర్వహించింది.
డాక్టర్లు ఏం చెప్పారు..?
ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నుంచి ఓ వైద్యబృందం బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు. కొన్ని పరీక్షలు కూడా ఇంటి వద్దే నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు ఈరోజు చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రికి వెళ్తారు. అక్కడ మరిన్ని పరీక్షలు నిర్వహించి వైద్యం మొదలు పెడతారు.
మరోవైపు చంద్రబాబుకి బెయిల్ విషయంలో అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ, హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన జడ్జి.. శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. కోర్టు నిబంధనలు విధించినా.. చంద్రబాబు ర్యాలీలు చేశారంటూ సీఐడీ తరపున ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పెన్ డ్రైవ్ లో సమర్పించారు. అయితే ఆయన ర్యాలీలో పాల్గొనలేదని, ప్రజలే ఆయన వద్దకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. మరిన్ని షరతుల విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరుస్తుందో చూడాలి.