బాబుకు భలే స్లోగన్ దొరికిందే

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు తప్ప ఇంకెవరూ గుర్తుండరు. అధికారంలో నుండి దిగిపోగానే వెంటనే సమాజం, పేదలు, కుటుంబాలు, పేదరిక నిర్మూలన గుర్తుకొచ్చేస్తాయి.

Advertisement
Update:2024-01-19 10:40 IST

కోతికి కొబ్బరికాయ దొరికినట్లు చంద్రబాబుకు బ్రహ్మాండమైన స్లోగన్ దొరికింది. అదేమిటంటే ‘పూర్ టు రిచ్’ అనే స్లోగన్ను చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిమ్మకూరులో భార్య భువనేశ్వరితో కలిసి ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలను ధనవంతులను చేయటమే తన లక్ష్యంగా చెప్పారు. పనిలోపనిగా పూర్ టు రిచ్ కాన్సెప్టును కూడా ఆవిష్కరించారు. నిమ్మకూరులో 1800 ఎకరాల భూమి ఉంటే 80 మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని తెగ ఫీలైపోయారు. మిగిలిన వాళ్ళంతా వలసెళ్ళిపోయారట.

గ్రామంలోని పారిశ్రామికవేత్తలంతా గ్రామంలోని కుటుంబాలను బాగుచేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపే విచిత్రంగా ఉంది. ఈ గ్రామంలోని కుటుంబాలను బాగుచేసే బాధ్యత తీసుకోమని పారిశ్రామికవేత్తలకు పిలుపిచ్చేబదులు ఆ పనేదో తానే చేయొచ్చు కదా. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు గ్రామంలోని ఎన్ని కుటుంబాలను బాగుచేశారు, గ్రామం అల్లుడిగా, పారిశ్రామికవేత్తగా చంద్రబాబు కుటుంబం ఎంతమంది పేదకుటుంబాలను ధనవంతులుగా చేసిందో చెబితే బాగుటుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు తప్ప ఇంకెవరూ గుర్తుండరు. అధికారంలో నుండి దిగిపోగానే వెంటనే సమాజం, పేదలు, కుటుంబాలు, పేదరిక నిర్మూలన గుర్తుకొచ్చేస్తాయి. చంద్రబాబులో నుండి సమాజోద్దారకుడు బయటకు వచ్చేస్తారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడైనా పూర్ టు రిచ్ అనే స్లోగన్ చంద్రబాబు వినిపించారు. పేదల అభివృద్ధి కోసం ఒక్కపైనైనా చేశారా..? పేదలను ధనవంతులుగా చేయొద్దని చంద్రబాబును ఎవరైనా అడ్డుకున్నారా..?

ఇప్పటికిప్పుడు పూర్ టు రిచ్ అనే స్లోగన్ ఎందుకు ఇస్తున్నారంటే.. తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. ఇంటికో ఉద్యోగమట, ఆదాయన్ని రెట్టింపు చేస్తానంటున్నారు. ఇంటికో ఉద్యోగం అని 2014 ఎన్నికల్లో కూడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటే మళ్ళీ సమాధానం ఉండదు. ఏదేమైనా జాబు రావాలంటే బాగు రావాలి అనే స్లోగన్ తో 2014లో యూత్ ను ఆకట్టుకున్న చంద్రబాబుకు 2024 ఎన్నికలకు పూర్ టు రిచ్ అనే స్లోగన్ దొరికినట్లుంది. మరీ స్లోగన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News