దేవినేని ఉమా.. చంద్రబాబు సీటివ్వలేదమ్మా..!
ఉమా, వసంతల్లో ఒకరిని మైలవరంలోనూ, రెండోవారిని విజయవాడకు అటువైపున్న పెనమలూరులోనూ సర్దాలని చంద్రబాబు ప్లాన్ చేశారు.
అనుకున్నట్లే అయింది. చంద్రబాబు మార్కు రాజకీయం ఏంటో దేవినేని ఉమాకు తెలిసొచ్చింది. మాజీ మంత్రిని, నందిగామ అభ్యర్థిని అనుకుంటూ ఊహల్లో ఉన్న ఉమాకు టికెటివ్వకుండా చంద్రబాబు మొండిచేయి చూపించారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో ఆ సీటు ఆయన చేతిలో పెట్టి, ఉమాకు హ్యాండిచ్చేశారు.
పెనమలూరులో బోడె ప్రసాద్ ఉడుంపట్టు
ఉమా, వసంతల్లో ఒకరిని మైలవరంలోనూ, రెండోవారిని విజయవాడకు అటువైపున్న పెనమలూరులోనూ సర్దాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ, ఉమా, వసంత ఇద్దరూ మైలవరం వదలడానికి ససేమిరా అన్నారు. మరోవైపు పెనమలూరులో టీడీపీ ఇన్‌ఛార్జి బోడే ప్రసాద్ ఉడుంపట్టుపట్టారు. తనకు టికెటివ్వకపోతే చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. దీంతో చంద్రబాబు అక్కడ బోడే ప్రసాద్‌కు టికెటివ్వక తప్పలేదు.
ఉమా పరిస్థితేంటి?
అటు సొంత నియోజకవర్గాన్ని వసంత పట్టుకుపోయారు. ఇటు పెనమలూరులో ప్రసాద్ పట్టు నిలబెట్టుకున్నారు. ఎటొచ్చీ మధ్యలో ఎటూ కాకుండా పోయింది దేవినేని ఉమానే. రోజూ చంద్రబాబు మెప్పుకోసం రోజూ వైసీపీని, జగన్‌ను తిట్టినందుకు ఇప్పుడు వైసీపీలోకి వెళదామన్నా వాళ్లూ రానివ్వని పరిస్థితి. ఇప్పుడు ఉమా రాజకీయ భవితవ్యమేంటన్నది కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్.