చంద్రబాబు దేన్ని నమ్ముకున్నారో తెలుసా..?

చంద్రబాబు అనుకున్న పనిని చాలావరకు ఎల్లోమీడియానే కానిచ్చేస్తుంది. ప్రత్యర్థులపైకి బురదచల్లేయటం, వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేయటం, మామూలు జనాల మైండ్ సెట్ ను చంద్రబాబుకు అనుకూలంగా ట్యూన్ చేయటం లాంటి పనులన్నింటినీ ఎల్లోమీడియానే చేసేస్తుంది.

Advertisement
Update:2024-01-16 12:32 IST

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రెండు అస్త్రాలను మాత్రమే నమ్ముకున్నారు. చంద్రబాబు రాజకీయం మొత్తం పొత్తులు, మీడియా మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు ఎప్పుడూ జననేత కాదు. లేస్తే మనిషిని కానంటు ప్రత్యర్థులను బెదిరిస్తూ, వాళ్ళపైకి మీడియాను ఉసిగొలుపుతూ నెట్టుకొచ్చేస్తున్నారు. మొదటిసారి చంద్రబాబు అస్త్రాలకు లొంగనిది జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే అంటే అతిశయోక్తికాదు. చంద్రబాబు అస్త్రాలకు జగన్ లొంగకపోవటమే కాదు ఎదురుతిరిగి వాటిని బద్దలు కొట్టారు.

అందుకనే జగన్ అంటే చంద్రబాబుకు అంతమంట. ప్రత్యర్థులను చంద్రబాబు ఎప్పుడూ నేరుగా ఎదుర్కోలేరు. ముందుగా తన మీడియాను ప్రయోగిస్తారు. చంద్రబాబు అనుకున్న పనిని చాలావరకు ఎల్లోమీడియానే కానిచ్చేస్తుంది. ప్రత్యర్థులపైకి బురదచల్లేయటం, వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేయటం, మామూలు జనాల మైండ్ సెట్ ను చంద్రబాబుకు అనుకూలంగా ట్యూన్ చేయటం లాంటి పనులన్నింటినీ ఎల్లోమీడియానే చేసేస్తుంది. కాంగ్రెస్ హ‌యాంలో మర్రి చెన్నారెడ్డి, నేదురమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి లాంటి వాళ్ళని ఇలాగే గబ్బుపట్టించారు.

2003లో వైఎస్సార్ ముందు కూడా చంద్రబాబు అస్త్రాలు పనిచేయలేదు. వైఎస్ ఇమేజి ముందు మీడియా, పొత్తులు పనికిరాకుండా పోయాయి. చంద్రబాబు పొత్తులను చిత్తుచేశారు కానీ, మీడియా బలాన్ని వైఎస్సార్ పూర్తిగా దెబ్బతీయలేకపోయారు. అయితే ఆ పనిని జగన్ పూర్తిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్‌ను అధికారంలోకి రాకుండా ఎల్లోమీడియా చాలా ప్రయత్నాలే చేసింది. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో మీడియా బలంకన్నా పొత్తులే చంద్రబాబును ఆదుకున్నాయి. మెజారిటీ మీడియా మద్దతున్నా, బీజేపీ, జనసేన మద్దతు కారణంగా మాత్రమే చంద్రబాబు ముఖ్యమంత్రి అవగలిగారు.

2019లో కూడా జగన్‌ను అధికారంలోకి రానీయకుండా ఎల్లోమీడియా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. భారీ మెజారిటీతో జగన్ అధికారంలోకి రావటమే కాకుండా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, ఎల్లోమీడియా మద్దతుతోనే అధికారంలోకి రావటానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరీసారి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నమ్ముకున్న రెండు అస్త్రాలు ఏ మేరకు అక్కరకు వస్తాయో చూడాలి.

Tags:    
Advertisement

Similar News