నోటి లెక్క చెప్పి ట్రోల్ అవుతున్న చంద్రబాబు, కేశవ్

టీడీపీ పెద్దలు కేవలం నోటికి వచ్చిన అంకెను చెబుతూ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వెయ్యి కాదు, రెండు వేలు కాదు ఏకంగా చంద్రబాబు, పయ్యావుల చెబుతున్న లెక్కల్లో తేడా లక్షా 50వేల కోట్ల రూపాయ‌లు ఉందని గుర్తు చేస్తున్నారు.

Advertisement
Update:2022-09-04 13:22 IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ మూడేళ్లలో జగన్‌ దోపిడీ రెండు లక్షల కోట్లు అంటూ ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ అనుకూలమ‌ని పేరుగాంచిన ప‌త్రిక‌లు ప్రముఖంగా ప్రచురించాయి. చంద్రబాబు ఈ ఆరోపణ చేసిన రోజే పయ్యావుల కేశవ్ అందుకు భిన్నంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. మూడేళ్లలో జగన్‌ 50వేల కోట్ల అవినీతి చేశారంటూ కేశవ్ ఆరోపించారు. ఒక పత్రికలో ఈ రెండు స్టేట్‌మెంట్లు ఓకే పేజీలో ప్రచురితమయ్యాయి. దాంతో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతోంది.

టీడీపీ పెద్దలు కేవలం నోటికి వచ్చిన అంకెను చెబుతూ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వెయ్యి కాదు, రెండు వేలు కాదు ఏకంగా చంద్రబాబు, పయ్యావుల చెబుతున్న లెక్కల్లో తేడా లక్షా 50వేల కోట్ల రూపాయ‌లు ఉందని గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి పెద్ద సంఖ్య చెప్పి ప్రజల్లో జగన్‌పై వ్యతిరేకత సృష్టించాలన్న తపన తప్ప.. టీడీపీ దగ్గర ఆధారం అంటూ ఏమీ లేదని విమర్శిస్తున్నారు.

గతంలో వైఎస్ హయాంలోనూ ఇలాగే.. అవినీతి అంటూ చంద్రబాబు పుస్తకం అచ్చేయించారు. దాన్ని రాసింది మైసూరా రెడ్డి. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పుస్తకంలో లక్ష కోట్లు అంటూ ఆరోపణ చేయడానికి ఎలాంటి ఆధారం లేదని.. కేవలం చంద్రబాబే పెద్ద సంఖ్యలో అవినీతి జరిగిందని ప్రజలను నమ్మించేందుకు లక్ష కోట్లు అని చేర్చమంటే చేర్చామని మైసూరా రెడ్డి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న రెండు లక్షల కోట్ల ఆరోపణ కూడా అలా ధోరణిలోనే ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News