అమరావతి నిర్మాణం.. ఆంధ్రాకు సాఫ్ట్ వేర్ పరిచయం
అమరావతి వెంట్రుక కూడా ఎవరూ కదిలించలేరని సినిమా డైలాగులు కొట్టారు చంద్రబాబు. అసలు అమరావతిలో ఏముందని కదిలిస్తారు, చంద్రబాబు ఏం చేశారని దాన్ని నాశనం చేస్తారు.
నేను కూత వేయకపోతే పొద్దుపొడవదు అనుకుందట ఓ కోడిపుంజు. చంద్రబాబు కూడా అలాంటివారే. అసలు తాను లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడో అధఃపాతాళంలో ఉండేదని, సాఫ్ట్ వేర్ కంపెనీలు, హైటెక్ సిటీ ఇవేవీ ఏపీకి వచ్చేవి కావని అంటుంటారు చంద్రబాబు. అంతేకాదు, అది నిజం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక నవ్యాంధ్రకు తానే సృష్టికర్తనని, అమరావతి నిర్మాతనని డబ్బా కొట్టుకోవడం కూడా ఆయనకే చెల్లింది. తాజాగా ఎన్నికల సమయంలో మరోసారి ఆ సెల్ఫ్ డబ్బా బయటకు తీశారు చంద్రబాబు. అమరావతిని నిర్మించింది, ఆంధ్రప్రదేశ్ కు సాఫ్ట్ వేర్ ను పరిచయం చేసింది తనకోసం కాదని, ప్రజల కోసమే అని అన్నారు చంద్రబాబు. తాడికొండలో జరిగిన ప్రజాగళం యాత్రలో పాల్గొన్న ఆయన అమరావతి విషయంలో కోతలు కోశారు.
అమరావతి పేరుతో నిధులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఐదేళ్లలో రాజధాని పూర్తయితే తాను మొదలు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పండదని తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టారు బాబు. మళ్లీ తనదే అధికారం అని, ఆ తర్వాత మరింతగా అమరావతి పేరు చెప్పి ప్రజా ధనం పిండుకోవచ్చనుకున్నారు. కానీ పరిస్థితి తారుమారయ్యేసరికి అమరావతి పేరుతో రాజకీయం మొదలుపెట్టారు.
అమరావతి వెంట్రుక కూడా ఎవరూ కదిలించలేరని సినిమా డైలాగులు కొట్టారు చంద్రబాబు. అసలు అమరావతిలో ఏముందని కదిలిస్తారు, చంద్రబాబు ఏం చేశారని దాన్ని నాశనం చేస్తారు. అన్నీ మొండిగోడలు, అరకొర నిర్మాణాలు, తాత్కాలిక భవనాలు. కేవలం తన రాజకీయ స్వలాభంకోసం, తన చుట్టూఉన్నవారి లాభం కోసం చంద్రబాబు అమరావతిని ముందుకు తెచ్చారు. ఒకప్పుడు శాతవాహనులు రాజధానిగా పరిపాలించిన ప్రాంతం ఇదని, దేవతల రాజధాని అమరావతి అని, అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టానని డబ్బా కొట్టుకున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రావడమే కాదని, అమరావతే రాజధాని అని ఉత్సవాలు చేసుకునే రోజు కూడా అదేనని చెప్పారు. తాను అధికారంలోకి రాగానే ప్రజావేదిక నిర్మాణం మళ్ళీ మొదలు పెడతానన్నారు చంద్రబాబు.