MLA,MP లపై సీబీఐ కేసుల్లో ఏపీకి ఫస్ట్ ప్లేస్

ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంగా, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై నమోదైన కేసుల రాష్ట్రాల వారీగా డేటాను అందించారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2017, 2022 మధ్య కాలంలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి.

Advertisement
Update:2022-12-07 19:24 IST

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత ఐదేళ్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 56 కేసులు పెట్టగా, 22 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభకు తెలియజేసింది.

ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంగా, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై నమోదైన కేసుల రాష్ట్రాల వారీగా డేటాను అందించారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2017, 2022 మధ్య కాలంలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి.

ఉత్తరప్రదేశ్ లో 6కేసులు, కేరళలో 6, పశ్చిమ బెంగాల్ లో 5, అరుణాచల్ ప్రదేశ్ లో 5, తమిళనాడులో 4, మణిపూర్ లో3, ఢిల్లీలో3, బీహార్లో3 , జమ్మూ కాశ్మీర్ లో2, కర్ణాటకలో 2, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లక్షద్వీప్ లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఆయా సీబీఐ కేసుల్లో 2017లో దోషులుగా తేలిన‌ వారి శాతం 66.90 కాగా, 2021లో అది 67.56 శాతంగా నమోదైంది. 2020లో అత్యధికంగా 69.83 శాతం మంది దోషులుగా నిర్ధారణ అయినట్టు మంత్రి వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News