ఏపీలో ఇవాల్టి నుంచి కులగణన.. ఏమేం అడుగుతారంటే..?

ఈ సర్వేలో భాగంగా ప్రజల కులం, ఉపకులంతో పాటు పలు వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. సర్వేలో భాగంగా దాదాపు 20 అంశాలకు సంబంధించిన ప్రశ్నలను రూపొందించినట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2023-11-15 09:31 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే పైలట్‌ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించనుంది. ఇందుకోసం 5 జిల్లాల్లోని 5 సచివాలయాలను ఎంపిక చేశారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, శ్రీకాకుళం జిల్లా గార మండలం, కోమసీమ జిల్లా రామచంద్రాపురం పరిధిలో, ఎన్టీఆర్ జిల్లాలోని సచివాలయం పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేయనున్నారు. ఆయా సచివాలయాల పరిధిలోని ఇళ్ల దగ్గరకు వెళ్లి వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కుల గణన సర్వే చేపట్టనున్నారు.

ఈ సర్వేలో భాగంగా ప్రజల కులం, ఉపకులంతో పాటు పలు వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. సర్వేలో భాగంగా దాదాపు 20 అంశాలకు సంబంధించిన ప్రశ్నలను రూపొందించినట్లు తెలుస్తోంది. సర్వేలో పూర్తయిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక ఐడీ నెంబర్ కేటాయించనున్నారు. జనన, మరణ వివరాలను సైతం సేకరిస్తారు. సర్టిఫికెట్స్‌లో ఉన్న చిరునామాలోనే నివసిస్తున్నారా.. లేదా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారా..? ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్స్‌, ఉద్యోగం, ఇంటి రకం, వంట గ్యాస్ సౌకర్యం, వ్యవసాయ భూమి విస్తీర్ణం, నివాస స్థలం లాంటి వివరాలు సేకరిస్తారు. యాప్‌లో వలంటీరు నమోదు చేసిన వివరాలను నిర్ధారించడానికి కుటుంబంలో ఎవరో ఒకరి ధృవీకరణను తీసుకుంటారు.

ఏపీలోని అన్ని వర్గాల్లోని పేదలకు సామాజిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా కులగణన చేపడుతున్నట్లు చెప్పారు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇవాళ, రేపు అన్ని జిల్లా కలెక్టరేట్లలో మేధావులు, విద్యావంతులు సలహాలు ఇవ్వొచ్చని తెలిపారు. దేశంలోనే ఫస్ట్ టైమ్‌ బిహార్‌ స్టేట్‌లో కులగణన పూర్తి చేశారని.. అధ్యయనం కోసం ఏపీ అధికారులను అక్కడికి పంపిస్తామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News