పదిరోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు : టీటీడీ చైర్మన్‌

వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు

Advertisement
Update:2025-01-08 15:46 IST

వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పదిరోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో ప్రత్యేక దర్శనాల రద్దు చేసినట్టు మీడియా సమావేశంలో తెలిపారు. ఈనెల 10న ఉదయం 4.30 గంటలరే ప్రొటోకాల్‌ దర్శనాలు , 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందని అన్నారు.టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ దర్శనాలకు అనుమతి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుపతిలోని ప్రత్యేక టోకెన్ల జారీ కేంద్రాల ద్వారా టోకెన్లు అందజేస్తున్నామని తెలిపారు. హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో టీటీడీ చైర్మన్ భక్తులకు అలర్ట్ ప్రకటించారు. భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలి అని చైర్మన్ కోరారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కును కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. గుంపులతో కూడిన ప్రదేశాల్లో తిరగకూడదని సూచించారు. టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడొద్దు. 3K CC కెమెరాలతో నిఘా ఉంచామని చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News