గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నకు జవాబు చెప్పండి
చంద్రబాబు ఎలాంటి మనిషో మనందరికీ తెలుసు. ఆయన ప్యాకేజీకి లొంగిపోయిన పవన్ ప్రజలకి సేవ చేస్తాను అంటున్నారు. డబ్బు కూడా వీలైనంత ఖర్చుపెట్టాలని కొత్త మాటలు మాట్లాడుతున్నారు.
భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గానీ, జనసేన ప్రతినిధులు గానీ ఆయనకు సమాధానం చెప్పగలిగితే బావుంటుంది.
గ్రంధి శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా అన్నారు.. ‘‘పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరంలో ఓడిపోయారు. ఆ తర్వాత ఐదేళ్లలో ఆయన భీమవరానికి ముచ్చటగా మూడుసార్లు మాత్రమే వచ్చారు. ఒకసారి సభకి, వారాహి యాత్రలో భాగంగా రెండోసారి, ఇదిగో ఎన్నికలకు ముందు ఇపుడు మూడోసారి. నేను ఇక్కడే ఇల్లు తీసుకుంటాను. ఇక్కడే ఉంటాను అంటున్నారు. లోకల్‌గా అందరికీ అందుబాటులో ఉంటాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆయన ఢిల్లీ–హైదరాబాద్ అంటూ తిరుగుతున్నదీ, పైరవీలూ, ప్రకటనలూ చేస్తున్నది కేవలం భీమవరం నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికేనా..?
చంద్రబాబు ఎలాంటి మనిషో మనందరికీ తెలుసు. ఆయన ప్యాకేజీకి లొంగిపోయిన పవన్ ప్రజలకి సేవ చేస్తాను అంటున్నారు. డబ్బు కూడా వీలైనంత ఖర్చుపెట్టాలని కొత్త మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండాలని కూడా పవన్ అంటున్నారు. వయసులో పెద్ద అయిన చంద్రబాబు బరిలో ఉండగానే ఆ మాట అంటున్నారు. మొన్నటికి మొన్న కుప్పంలో భువనేశ్వరి గారు ఒక సభలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకు ఇక రెస్ట్ ఇద్దాం. ఈసారి నేనే పోటీ చేద్దాం అనుకుంటున్నా’’ అనేశారు. అంటే ఎన్నికలయ్యాక, పవనో, భువనేశ్వరో, లోకేష్‌బాబో సీఎం అయ్యే అవకాశం ఉందా..? వీళ్ల ముగ్గురూ వేరేగా మాట్లాడుకుంటున్నారా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు గ్రంధి శ్రీనివాస్.
సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ, హైదరాబాద్‌లోనే ఉంటూ, కథ నడిపిస్తున్న పవన్ కళ్యాణ్‌కి భీమవరంలో ఉండటం అయ్యేపనేనా..? అన్నది ఆయన సందేహం. ఎప్పటికప్పుడు, ఏది తోస్తే అది మాట్లాడి, నిలకడలేని రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి భీమవరం జనానికి దగ్గరగా ఉండటం సాధ్యం కాదు కదా అని అనుమానం. జగన్‌మోహన్‌రెడ్డి అనే సూటిగా, స్పష్టంగా, ధైర్యంగా ఉండే నాయకుడ్ని కాదనుకుంటున్న వీళ్లు ఎలా నెగ్గుతారో అర్థం కావడం లేదని శ్రీనివాస్ అన్నారు.
ఆయన మర్యాదకరమైన పదజాలంతో, సున్నితమైన హాస్యంతో పవన్ గందరగోళపు రాజకీయాల్ని ఎండగట్టారు. ఎన్నికల్లో డబ్బు పంచాలో, వద్దో అనే విషయమూ పవన్ తేల్చుకోలేకపోతున్నారని చురక అంటించారు. కార్యకర్తలకి భోజనాలు పెట్టకపోతే ఎలా..? దారి ఖర్చులు ఇవ్వకపోతే ఎలా అని పవన్ ఇప్పుడు మాట్లాడుతున్నారని హేళన చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ అడిగినవన్నీ నిజాలు. నిజమైన సమస్యలు.
జనసేన నాయకులు సమాధానం చెప్పగలరా..? భీమవరంలో నెలకి ఒక్క రోజన్నా పవన్ కళ్యాణ్ ఉండగలుగుతారా..? నేను లోకల్ ఇక్కడ అంటున్నారు గ్రంధి శ్రీనివాస్.