బుచ్చయ్య భూమి అమ్మి భారీగా నష్టపోయారు- కొడాలి నాని

అమరావతికి కమ్మరావతి, భ్రమరావతి అన్న పేర్లు రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు పోకడలేనని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.

Advertisement
Update:2022-09-15 15:39 IST

అమరావతికి కమ్మరావతి, భ్రమరావతి అన్న పేర్లు రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు పోకడలేనని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. అసెంబ్లీలో వికేంద్రీకరణ అంశంపై మాట్లాడిన కొడాలి...అనేక మంది టీడీపీ నాయకులు చంద్రబాబును నమ్మి అమరావతిలో భూములు కొన్నారని.. అందుకే ఇప్పుడు పాదయాత్రకు వారంతా స్వాగతం పలుకుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా రాజమండ్రిలో ఉన్న తన భూమిని అమ్మి అమరావతిలో ల్యాండ్ కొన్నారని వివరించారు. అప్పట్లో రాజమండ్రిలో అమ్మిన భూమి విలువ ఇప్పుడు 11 కోట్లకు చేరిందని.. అమరావతిలో భూమి విలువ మాత్రం పడిపోయిందని.. అందుకే బుచ్చయ్య చౌదరి అసెంబ్లీలో గట్టిగట్టిగా అరుస్తున్నారని కొడాలి చెప్పారు.

అమరావతివాదులు చేస్తున్న పాదయాత్ర పూర్తిగా రాజకీయపరమైనదేనన్నారు. ఎవరైతే వైసీపీ తరపున గట్టిగా మాట్లాడుతారో వారి నియోజకవర్గాల మీదుగాఎక్కువ రోజులు పాదయాత్ర ప్లాన్ చేశారని.. అందుకే గుడివాడ నియోజకవర్గంలో ఏకంగా 45 రోజుల పాటు యాత్ర చేస్తున్నారని చెప్పారు. నేరుగా హైవే వెంట వెళ్తే 50 రోజుల్లోపూర్తయ్యే యాత్రను మెలికలు తిప్పి తీసుకెళ్తున్నారని కొడాలి విమర్శించారు.

ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవడం చేతగాని రేణుకాచౌదరి కూడా ఏపీకి వచ్చి జగన్‌ తప్పుకో అంటోందని కొడాలి ఎద్దేవా చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం భూములు ఇచ్చిన దళితులకు ఎక్కడో దూరంగా ముంపు ప్రాంతాల్లో భూములు ఇచ్చారని.. అదే గన్నవరం ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రాఘవేంద్రరావు, అశ్వనీదత్‌లకు మాత్రం అమరావతిలో వారికి నచ్చిన చోట భూములు ఇచ్చారని వివరించారు. ఇలాంటి పనులు చేయడం వల్లనే అమరావతికి కమ్మరావతి అన్న పేరు వచ్చిందన్నారు.

Tags:    
Advertisement

Similar News