టీడీపీ బంద్‌కు బీజేపీ మద్దతు లేఖ ఫేక్.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం : పురందేశ్వరి
టీడీపీ బంద్‌కు బీజేపీ మద్దతు అనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో దగ్గుబాటు పురందేశ్వరి స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, తాము బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (సెప్టెంబర్ 11) టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టీడీపీ చేపట్టనున్న బంద్‌కు బీజేపీ కూడా మద్దతు ఇస్తున్నదని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరిట ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
టీడీపీ బంద్‌కు బీజేపీ మద్దతు అనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో దగ్గుబాటు పురందేశ్వరి స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, తాము బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. టీడీపీ పార్టీ ఇచ్చిన సోమవారం రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దుతు ఇచ్చినట్లుగా బీజేపీ లెటర్ హెడ్‌పై తన సంతకంతో ఒక లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ లెటర్ పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఎవరో ఈ లెటర్‌ను మార్ఫింగ్ చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ లెటర్ హెడ్‌పై ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని చెప్పారు. టీడీపీ బంద్‌కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. కాగా, చంద్రబాబు అరెస్టు అక్రమమని రెండు రోజుల క్రితం దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. బీజేపీ తరపున తన ఖండనను కూడా విడుదల చేశారు.
ఇక టీడీపీ బంద్‌కు మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన బంద్‌కు జనసేన సంఘీభావం ప్రకటిస్తోందని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రజల పక్షాన ఎలుగెత్తే విపక్షాలను రాజకీయ కక్ష సాధింపుతో.. కేసులు, అరెస్టులతో వేధిస్తోందని వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. సోమవారం నాటి బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.