సీట్లకోసం బీజేపీ ఉడుంపట్టు పట్టిందా..?

బీజేపీ అడిగినట్లు 35 అసెంబ్లీ, జనసేనకు 28 సీట్ల ఇస్తే రెండింటికే 63 అసెంబ్లీ సీట్లు పోతాయి. అలాగే పది పార్లమెంటు సీట్లను వదులుకోవాల్సుంటుంది. పార్లమెంటు సీట్లు బీజేపీకి అవసరం అలాగే అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకు ముఖ్యం.

Advertisement
Update:2024-02-10 10:52 IST

రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే అడిగిన సీట్లను ఇవ్వాల్సిందే అని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. పొత్తు, సీట్ల సర్దుబాటుపై చంద్రబాబునాయుడు ఇటీవ‌ల‌ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ చర్చల్లోనే బీజేపీకి 35 అసెంబ్లీ, 8 లోక్ సభ సీట్లు కేటాయించాలని అమిత్ గట్టిగా చెప్పారట. అయితే చంద్రబాబు మాత్రం 4 పార్లమెంటు, 15 అసెంబ్లీ సీట్లిస్తామని చెప్పినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. అందుకు అమిత్ షా ఒప్పుకోలేదట.

2014 ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్నప్పుడే 15 అసెంబ్లీ, 4 పార్లమెంటు సీట్లలో పోటీచేసిన విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారట. పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీచేసినా ఒకటే, ఒంటరిగా పోటీచేసినా తమకు ఒకటే అన్న పద్దతిలో అమిత్ షా చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారట. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందే అని కచ్చితంగా అమిత్ షా చెప్పినట్లు సమాచారం. దాంతో సీట్ల సంఖ్యపై పార్టీ నేతలతో కూడా మాట్లాడి ఏ సంగతి చెబుతానని చెప్పి చంద్రబాబు వచ్చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ అడిగినట్లు 35 అసెంబ్లీ, జనసేనకు 28 సీట్ల ఇస్తే రెండింటికే 63 అసెంబ్లీ సీట్లు పోతాయి. అలాగే పది పార్లమెంటు సీట్లను వదులుకోవాల్సుంటుంది. పార్లమెంటు సీట్లు బీజేపీకి అవసరం అలాగే అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకు ముఖ్యం. అయితే అసెంబ్లీల్లో గెలిస్తేనే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది. అందుకనే బీజేపీ నేత‌లు పార్లమెంటు సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లను కూడా ఎక్కువగా అడుగుతున్నారట.

మిత్రపక్షాలకు అన్ని సీట్లు ఇచ్చేస్తే చంద్రబాబుకు పార్టీ నేతల నుండి సమస్యలు పెరిగిపోవటం ఖాయం. 1 శాతం ఓట్ల షేర్ కూడా లేకుండానే అన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను బీజేపీ అడగటం అన్యాయయమని జనసేన నేతలు మండిపోతున్నారట. 5.6 శాతం ఓట్ షేర్ ఉన్న తమ పార్టీకి చంద్రబాబు ఇంకెన్ని సీట్లివ్వాలని జనసేన నేతలు పవన్ దగ్గర ప్రస్తావించారట. కాకపోతే బీజేపీ అడిగినట్లు 35 అసెంబ్లీ, 8 పార్లమెంట్ సీట్లు ఇవ్వకపోయినా కనీసం 20 అసెంబ్లీ 6 లోక్ సభ సీట్లయినా వదులుకోక తప్పేట్లు లేదు. మరి చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News