అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండటం నా విధి : విజయమ్మ
ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని విజయమ్మ వాపోయారు. అన్యాయం జరిగిన బిడ్డ జరిగిన బిడ్డ తరుపున ఉండి మాట్లాడటం నా ధర్మం. నా విధి అని ఆమె తెలిపారు. మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండేందుకే నిజం చెబుతున్నా. అమ్మగా నాకు ఇద్దరు సమానమే.. అలాగే వైఎస్సార్ మాట కూడా ముఖ్యమే. ఆస్తులు ఇద్దరు బిడ్డలకు సమానం అనేది నిజం. నలుగురు పిల్లలకు ఆస్తులు సమానంగా ఉండాలన్నది వైఎస్సార్ ఆజ్ఞ. బాధ్యత గల కొడుకుగా జగన్ ఆస్తులను సంరక్షించాలి. వైఎస్సార్ చివరి రోజుల్లో ఆయనకు జగన్ మాట ఇచ్చారు.
నాన్న నీ తర్వాత పాప మేలు కోరే వారిలో నేనే మొదటివాడిని అని.. వైఎస్సార్‌కు జగన్ మాట ఇవ్వడం కూడా నిజం. ఈ విషయం 'నాలో నాతో వైఎస్సార్' పుస్తకంలో ఎప్పుడో రాశా’’ అని విజయలక్ష్మి స్పష్టం చేశారు. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులెత్తి మనవి చేసుకుంటున్నా. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయొద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం పట్ల నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. మీరెవరూ రెచ్చగొట్టవద్దని నా మనవి’’ అని లేఖలో పేర్కొన్నారు.