బాలకృష్ణ అవుట్
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకునే మహానాడులో ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ ఫొటో ఎక్కడా కనబడకుండా చేయటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
నందమూరి వంశం తరపున తెలుగుదేశంపార్టీలో యాక్టివ్ గా ఉండే ఒకే ఒక్కడు నందమూరి బాలకృష్ణ. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. పార్టీలో కూడా యాక్టివ్ గానే ఉంటారు. అలాంటి బాలకృష్ణ రాజమండ్రిలో జరిగిన టీడీపీ మహానాడులో ఎక్కడా కనిపించలేదు. మహానాడు సందర్భంగా టీడీపీ ఇచ్చిన పేపర్ ప్రకటనలోనూ బాలకృష్ణ ఫొటోలేదు. అడ్వర్టైజ్మెంట్లలోనే కాదు చివరకు మహానాడు వేదిక మీద కూడా అడ్రస్ కనబడలేదు.
వేదికమీద ఒకవైపు ఎన్టీఆర్ ఫొటో మరోవైపు చంద్రబాబునాయుడు ఫొటో మాత్రమే ఉంది. మధ్యలో ఉన్న పెద్ద పోస్టర్లో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్ లో ముగ్గురి ఫొటోలకు పైన ఎడమవైపున ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, కుడివైపున తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞనేశ్వర్ చిన్న ఫొటోలున్నాయంతే. కిందభాగాన కొందరు ముఖ్య నేతల ఫొటోలున్నాయంతే.
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకునే మహానాడులో ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ ఫొటో ఎక్కడా కనబడకుండా చేయటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. చంద్రబాబుకు తెలీకుండా అడ్వర్టైజ్మెంట్లలో, వేదికమీద పోస్టర్లో బాలకృష్ణ ఫొటో మాయమైపోదు. పైగా అడ్వర్టైజ్మెంట్లలో ఏదో తప్పుజరిగిందని అనుకున్నా వేదికమీద ఉన్న పెద్ద పోస్టర్లో అయినా బాలకృష్ణ ఫొటో కనబడాలి కదా. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ముగ్గురి ఫొటోలున్నపుడు మరి బాలకృష్ణ ఫొటో ఎందుకు మాయమైపోయింది..?. మరి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పేరుతో టీడీపీ ఈరోజు ఇచ్చిన పేపర్ ప్రకటనలో బాలయ్య ఫొటో ప్రత్యక్షమైంది. మహానాడు యాడ్‌లో బాలయ్య ఎందుకు లేడు..?
ఎన్టీఆర్ వారసుడిగా, చంద్రబాబు బావమరది కమ్ వియ్యంకుడిగా, లోకేష్ మామగారిగా త్రిబుల్ యాక్షన్ చేస్తున్న బాలయ్య ఫొటోనే ఎగిరిపోయిందంటే ఇక మిగిలిన వారసుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పైగా ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ఎన్టీఆర్ వారసులందరినీ రావాలని ఆహ్వానించారు. వారసులందరినీ ఆహ్వానించటం కూడా ఏదో మొక్కుబడిగానో లేకపోతే ఏదో ప్రయోజనం ఆశించి మాత్రమే ఆహ్వానించారని అర్థమైపోతోంది. చంద్రబాబు ఆలోచనలు బాగా అర్థమవ్వబట్టే జూనియర్ ఎన్టీఆర్ ఎంత వీలుంటే అంత దూరంగా ఉంటున్నారు పార్టీకి. ఎంతైనా యూజ్ అండ్ త్రో పాలసీ కదా చంద్రబాబుది. మొత్తానికి మహానాడులో తన ఫొటో లేకపోవటంపై బాలయ్య రియాక్షన్ ఏమిటో తెలీదు.