ఫ్లెక్సీలకు కూడా భయపడుతున్నారా..?
జూనియర్ ను డైరెక్టుగా ఏమీ అనలేక, అలాగని అభిమానులను కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలోనే బహుశా బాలయ్యకు కూడా బాగా మండుతున్నట్లుంది.
నందమూరి నటసింహం బాలయ్య పరిస్థితి ఇలాగ తయారైంది. జూనియర్ ఎన్టీఆర్ ను నేరుగా కాదు తన ఫ్లెక్సీలను కూడా సహించలేని స్థితికి బాలయ్య దిగజారిపోయారా..? లేకపోతే జూనియర్ ఫ్లెక్సీలను చూసి ఉలిక్కిపడుతున్నారా..? ఇదీ కాకపోతే ఫ్లెక్సీలకు కూడా భయపడుతున్నారా..? ఇప్పుడిదే నందమూరి అభిమానులకు అర్థంకావటంలేదు. విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించేందుకు బాలయ్య తన మద్దతుదారులతో వచ్చారు. కారు దిగగానే ఎదురుగా జూనియర్ ఫ్లెక్సీలు కనిపించాయి.
ఇంకేముంది అబ్బాయ్ ఫ్లెక్సీలను చూడగానే బాబాయ్ కు బాగా మండిపోయింది. వెంటనే తన మద్దతుదారులకు చెప్పి ఫ్లెక్సీలను తీయించేశారు. ఫ్లెక్సీలను అక్కడి నుండి తీసేంతవరకు బాలయ్య ఒప్పుకోలేదు. జూనియర్ అంటే బాలయ్యకు ఎందుకింత మంట..? జూనియర్ ఉనికినే కాదు చివరకు తన ఫ్లెక్సీలను కూడా తట్టుకోలేకపోతున్నట్లున్నారు. కారణం ఏమిటంటే.. టీడీపీలో చంద్రబాబునాయుడు, లోకేష్ సభలు ఎక్కడ జరిగినా అక్కడ జూనియర్ అభిమానులు ప్రత్యక్షమవుతున్నారు. జూనియర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టుకుని కాబోయే సీఎం సీఎం అంటు నానా రచ్చచేస్తున్నారు.
దీన్ని తండ్రి, కొడుకులు సహించలేకపోతున్నారు. జూనియర్ ను డైరెక్టుగా ఏమీ అనలేక, అలాగని అభిమానులను కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలోనే బహుశా బాలయ్యకు కూడా బాగా మండుతున్నట్లుంది. చంద్రబాబు, లోకేష్ విషయంలో జూనియర్ అభిమానుల ప్రవర్తనను బాలయ్య తట్టుకోలేకపోతున్నట్లున్నారు. చంద్రబాబు, లోకేష్ ను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. టీడీపీ వాళ్ళు గిల్లి వదిలేస్తుంటే కొడాలి ఫుల్లుగా ఫైరవుతున్నారు.
కొడాలి-జూనియర్ బాగా సన్నిహితులన్న విషయం అందరికీ తెలిసిందే. కొడాలి తిట్ల వెనుక జూనియర్ ఉన్నారేమో అనే అనుమానాలు కూడా బాలయ్యలో ఉన్నట్లుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే తండ్రి ఘాట్ దగ్గర జూనియర్ ఫ్లెక్సీలు కనబడగానే మండిపోయారు. టీడీపీకి జూనియర్ మరింత దూరం జరగటానికి ఈ ఘటన బాగా ఆజ్యంపోస్తుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ ఘటన ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలాగుంటుందో చూడాలి.