పవన్ ట్రాపులో మంత్రులు ఇరుక్కున్నారా..?
జనాల్లో పవన్ కు ఇమేజీ లేదని చెబుతున్నప్పుడు మరి పవన్ గురించే ఎందుకు మంత్రులు, నేతలు పదేపదే మాట్లాడుతున్నారు..? వారాహి వెహికల్ కావచ్చు, పవన్ చేస్తున్న యాత్రలు కావచ్చు మరోటి కూడా కావచ్చు.
ఒకవైపేమో పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారని ఎగతాళి చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబునాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేస్తున్నాడంటూ దెప్పి పొడుస్తున్నారు. ఇదే సమయంలో 24 గంటలూ పవన్ నామస్మరణే చేస్తున్నారు. మంత్రులు, వైసీపీ నేతల గురించే ఇదంతా. అధికార పార్టీ నేతల వైఖరి ఏమిటో అర్థం కావటంలేదు. పోటీచేసిన రెండు చోట్లా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన విషయాన్ని ఎవరు కాదనలేరు.
జనాల్లో పవన్ కు ఇమేజీ లేదని చెబుతున్నప్పుడు మరి పవన్ గురించే ఎందుకు మంత్రులు, నేతలు పదేపదే మాట్లాడుతున్నారు..? వారాహి వెహికల్ కావచ్చు, పవన్ చేస్తున్న యాత్రలు కావచ్చు మరోటి కూడా కావచ్చు. పవన్ మానాన పవన్ను వదిలిస్తే నాలుగు మాటలంటారు పట్టించుకోకపోతే తానే వదిలేస్తారు కదా. పవన్ రెండు మాటలనగానే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు వారంరోజుల పాటు దాన్ని సాగదీస్తున్నారు. ఒకళ్ళకి పదిమంది పవన్ పై విరుచుకుపడిపోతున్నారు.
మంత్రులు, అధికారపార్టీ నేతల వల్ల జరుగుతున్నదేమంటే పవన్ కు జనాల్లో హీరో ఇమేజ్ వస్తోంది. పవన్ కు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. రేపటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తురు ఎవరు ఓడుతారన్నది పక్కనపెట్టేస్తే అసలు పవన్ గురించి మంత్రులు ఎందుకని పదేపదే మాట్లాడుతున్నారు. వారాహి వెహికల్ గురించే తీసుకుంటే దాని రిజిస్ట్రేషన్ వ్యవహారాలు తెలంగాణా ప్రభుత్వానికి సంబంధించింది. అసలు దాంతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేనేలేదు. అయినా నాలుగు రోజుల పాటు ఇదే విషయాన్ని మంత్రులు పదేపదే ప్రస్తావించటం అవసరమా ?
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు కూడా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడేవారు. అలా మాట్లాడి మాట్లాడే జగన్ కు జనాల్లో ఇమేజి తెచ్చిపెట్టారు. ఇపుడు మంత్రులు పవన్ విషయంలో మంత్రులు అదే చేస్తున్నారు. పవన్ కావాలనే మంత్రులను కెలికి వదిలేస్తున్నారు. దాన్ని గమనించకుండా మంత్రులు, నేతలు నోటికొచ్చినట్లు పవన్ గురించి రోజుల తరబడి మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ ట్రాపులో మంత్రులు పడిపోయినట్లే ఉన్నారు. మరీ విషయాన్ని మంత్రులు ఎప్పుడు తెలుసుకుంటారో ?