అప్పుడు లోకేష్, ఇప్పుడు జగన్.. మధ్యలో పోలీస్

ప్రభుత్వం మారినా పోలీసులకు మాత్రం తిట్లు కామన్ అయిపోయాయి. అప్పట్లో లోకేష్ ఆవేశపడుతుంటే సైలెంట్ గా నిలబడిన పోలీసులు ఇప్పుడు జగన్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Advertisement
Update:2024-07-22 11:50 IST

మధుసూదన్ రావ్.. గుర్తు పెట్టుకో..!

ఎల్లకాలం ఇదేమాదిరిగా ఉండదు

ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం

నీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు అర్థమేంటో తెలుసా..?

అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు

ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డం కోసం మీరున్నారు.. గుర్తు పెట్టుకోండి.

ఓ పోలీస్ అధికారితో మాజీ సీఎం జగన్ ఈరోజు అన్న మాటలివి. ప్లకార్డులతో అసెంబ్లీలో నిరసన తెలిపేందుకు వెళ్తుండగా.. వాటిని పోలీసులు లాగేసుకుని చింపి వేశారనేది వైసీపీ నేతల ఆరోపణ. తమ ప్లకార్డులను చింపివేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నించారు జగన్.


పోలీసులది ఓవర్ యాక్షనా కాదా అనే విషయం పక్కనపెడితే.. ఏపీ పోలీసులెప్పుడూ ప్రతిపక్షాల చేతిలో మాటలు పడాల్సిందేనా అనే వాదన వినపడుతోంది. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. నారా లోకేష్ కూడా పోలీసులపై ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు.


Full View

చంద్రబాబుని అరెస్ట్ చేసిన క్రమంలో ఆయన్ను కలిసేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డగించారని, ఆపివేశారని అప్పుడు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. ఎవరికోసం వారు ఇదంతా చేస్తున్నారో అందరికీ తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అయినా పోలీసులకు మాత్రం తిట్లు కామన్ అయిపోయాయి. అప్పట్లో లోకేష్ ఆవేశపడుతుంటే సైలెంట్ గా నిలబడిన పోలీసులు ఇప్పుడు జగన్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News