ఏపీ, తెలంగాణ మ‌ధ్య చిచ్చుపెట్టాల‌ని చూస్తున్నారు.. - మంత్రి కాకాణి

రాజధాని పేరుతో అవినీతికి పాల్పడటం వల్లే ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింద‌ని మంత్రి కాకాణి చెప్పారు. నాలుగేళ్ల తమ పాలనలో వర్షాలు విస్తారంగా పడిన విషయం తెలిసిందేనని మంత్రి చెప్పారు.

Advertisement
Update:2023-09-07 08:47 IST

ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఏపీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. అందులో రామోజీరావు శ‌కుని పాత్ర పోషిస్తున్నార‌ని మండిప‌డ్డారు. బుధ‌వారం ఆయ‌న నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. రామోజీకి ద‌మ్ముంటే.. చంద్ర‌బాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల‌పై క‌థ‌నాలు రాయాల‌ని స‌వాల్ విసిరారు. దొంగ హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేయడం, రాష్ట్రాన్ని దోచేయడంపై, ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీసులపై సమగ్ర కథనాలు రాయాలని సూచించారు.

రాజధాని పేరుతో అవినీతికి పాల్పడటం వల్లే ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింద‌ని మంత్రి కాకాణి చెప్పారు. నాలుగేళ్ల తమ పాలనలో వర్షాలు విస్తారంగా పడిన విషయం తెలిసిందేనని మంత్రి చెప్పారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యమయ్యేసరికి కనీస జ్ఞానం లేక కరువు మండలాలు ప్రకటించాలనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ గురించి ఈనాడులో రాయగలిగితే చెప్పేందుకు తాము సిద్ధమన్నారు. మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్ అక్ర‌మాలు ప‌శ్చిమ బెంగాల్‌లోని శార‌దా కుంభ‌కోణం వంటివని చెప్పారు. ప్ర‌జ‌లు మార్గ‌ద‌ర్శి విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి కాకాణి సూచించారు.

*

Advertisement

Similar News