ఏపీ ప్రభుత్వ సలహాదారులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తాజాగా జరిగిన వాదనల్లో కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా నియమించుకుంటూ పోతే సలహాదారుల సంఖ్యకు పరిమితి ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది.

Advertisement
Update:2023-02-02 20:10 IST

ఏపీలో దేవాదాయ శాఖ సలహాదారులుగా నియమితులైన ఇద్దరి విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఈరోజు కూడా వాదనలు జరిగాయి. ఆ శాఖతో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చి సలహాదారులుగా నియమితులైన వారిలో జవాబుదారీతనం ఎలా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. బయటి వారికి ప్రవర్తనా నియమావళి ఉండదని, వారివల్ల సున్నిత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 28కు వాయిదా వేసింది.

పరిమితి లేదా..?

సలహాదారుల వ్యవహారంపై గతంలో కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పోస్ట్ ల రాజ్యాంగ బద్ధతని తేలుస్తామని చెప్పింది. తాజాగా జరిగిన వాదనల్లో కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా నియమించుకుంటూ పోతే సలహాదారుల సంఖ్యకు పరిమితి ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వం వాదన ఏంటంటే..

మరోవైపు ఎప్పటి నుంచో సలహాదారుల నియామకాలు జరుగుతున్నాయని, ఆ నియామకాలపై ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగ విరుద్ధంగా వీరిని నియమించట్లేదని, కేబినెట్‌ హోదా ఇవ్వట్లేదని తెలిపారు. చాలామంది సలహాదారుల కాలపరిమితి త్వరలో ముగిసిపోతుందన్నారు. వాదనలు విన్న ఏపీ హైకోర్టు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News