దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

దివ్యాంగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అర్హులైన వారందరికీ స్కూటీలను పంపిణీ చేయనుందని ఏపీ వీరాంజనేయ స్వామి తెలిపారు.

Advertisement
Update:2024-12-03 15:26 IST

దివ్యాంగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అర్హులైన వారందరికీ స్కూటీలను పంపిణీ చేయనుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. జనాభాలో 2.23 శాతం ఉన్న దివ్యాంగులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దివ్యాంగుల హక్కులను కాపాడడంతో పాటు వారి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరోవైపు ప్రపంచ దివ్యాంగుల సందర్బంగా వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. వైకల్యం అనేది శరీరానికే కానీ.. సంకల్పానికి కాదు. ఆత్మ‌స్థైర్యంతో తాము ఎవ‌రికీ తీసిపోమ‌ని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులంద‌రికీ ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

Tags:    
Advertisement

Similar News