మార్గదర్శి యాజమాన్యానికి పరువు నష్టం నోటీసులు!

మార్గదర్శి యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ సిద్ధమైంది. దర్యాప్తులో భాగంగా తీసుకున్నట్టు చర్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ, అధికారుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని సీఐడీ చెబుతోంది.

Advertisement
Update:2023-06-10 09:46 IST

మార్గదర్శి సంస్థ తనకున్న మీడియా సాయంతో దర్యాప్తు సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. పరువు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నందుకు గాను మార్గదర్శి యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ సిద్ధమైంది. దర్యాప్తులో భాగంగా తీసుకున్నట్టు చర్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ, అధికారుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని సీఐడీ చెబుతోంది.

ఇందుకు మార్గదర్శి సంస్థకు అనుకూల మీడియా సహకరిస్తోందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ ప్రచారం చేయడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చూసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతోంది. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న రామోజీరావు, శైలజా కిరణ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు సీఐడీ అధికారులు చెబుతున్నారు.

ఇటీవల శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించగా.. ఆ మరుసటి రోజు ఈనాడు పత్రికలో.. విచారణకు ఆమె సహకరించారని అదనపు ఎస్పీ రవికుమార్‌ చెప్పినట్టు ప్రచురించారు. ఆ తర్వాత మరుసటి రోజు రవికుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను శైలజాకిరణ్ విచారణకు సహరించినట్టు చెప్పలేదని వివరణ ఇచ్చారు.

ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ 48 గంటల్లోనే మాట మార్చేశారని మళ్లీ ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇలా మాట మార్చడం వెనుక ఎవరి ప్రోద్బలమో ఉందన్న అభిప్రాయాన్ని ఆ పత్రిక వ్యక్తం చేసింది. ఈ తరహా ప్రచారంపైనే సీఐడీ సీరియస్‌గా ఉంది. త్వరలోనే ఈ ప్రచారానికి కారణమైన వారికి నోటీసులు ఇవ్వబోతోంది.

Tags:    
Advertisement

Similar News