రుషికొండ ప్యాలెస్ ఇష్యూ.. షర్మిల ఏమందంటే..?
రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు. ఇక ఒక అడుగు ముందుకేసి రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలన్నారు.
విశాఖలోని రుషికొండ బిల్డింగ్స్‌పై తెలుగుదేశం నేతలు, ఎల్లో మీడియా నానాయాగి చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ఆ భవనాలను తన సొంతానికి కట్టుకున్నట్లుగా గత మూడు, నాలుగు రోజులుగా తెలుగుదేశం, దాని అనుబంధ మీడియా ప్రచారం చేస్తోంది. జగన్ మాయమహల్ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలు రాసుకొచ్చాయి.
ఐతే తాజాగా ఇదే అంశంపై ఏపీసీసీ చీఫ్, జగన్ సోదరి షర్మిల స్పందించారు. ఆమె కూడా ఎల్లో మీడియా మాటలనే వల్లెవేశారు. రుషికొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు షర్మిల. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు. ఇక ఒక అడుగు ముందుకేసి రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలన్నారు. తప్పని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వైసీపీ దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపణలు చేశారు షర్మిల.
నిజానికి ఈసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పరిపాలన చేయాలని భావించారు జగన్. ఆ విషయాన్ని ఎన్నికల ప్రచారంలోనూ స్పష్టం చేశారు. అందులో భాగంగానే సీఎంతో పాటు రాష్ట్రానికి వచ్చే అతిథుల కోసం రుషికొండపై ఏడు బ్లాకుల్లో భవనాలను నిర్మించారు. ఆ భవనాలకు స్థానిక రాజవంశాలైన వేంగి, కళింగ, గజపతి అనే పేర్లు కూడా పెట్టారు. ఈ భవనాల నిర్మాణం ఖర్చు పెట్టింది కూడా రూ. 500 కోట్లలోపే. భవనాలు అక్కడే ఉన్నాయి. విదేశాల నుంచి తెప్పించిన విలువైన ఫర్నిచర్ అక్కడే ఉంది. కానీ తెలుగుదేశం నేతలు మాత్రం జగన్ పెద్ద తప్పు చేశారని ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి గతంలో రూ.700 కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు నిర్మించిన తాత్కాలిక సచివాలయం కంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన భవనాలను నిర్మించింది జగన్ సర్కార్. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఆ భవనాలను అద్భుతంగా వినియోగించుకోవచ్చు. కానీ ఎంతసేపు జగన్‌పై బురద జల్లేందుకే ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం నేతలు. కానీ, ఇదే భవనాలను బాబు హయాంలో నిర్మించి ఉంటే ఆయనను భుజాలకెత్తుకుని మోసేవారు.