ఆంధ్రజ్యోతి మాత్రమే అచ్చేసిన జగన్‌- మోడీ కథ

ఆంధ్రజ్యోతి తీరు చూస్తుంటే కేసీఆర్‌కు, జగన్‌కు మధ్య వివాదం రాజేయాలన్నట్టుగా ఉంది. షర్మిల బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందన్న విమర్శలకు మరింత బలాన్ని ఇచ్చేలా ఆంధ్రజ్యోతి ప్రచారం ఉంది.

Advertisement
Update:2022-12-06 07:49 IST

ప్రధాని మోడీతో నేతల భేటీలో చర్చించిన వివరాలు పెద్దపెద్ద జాతీయ పత్రికలకే అంత ఈజీగా అందవు. అసలు కీలకమైన విషయాలు పీఎంవో చెబితే గానీ లీకుల రూపంలో కూడా మీడియాకు దొరకవు. కానీ ఒక్క ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం తాను ముందే రాయలనుకున్నది రాస్తుంది. జగన్‌ విషయంలో అయితే మరింత దూకుడుగా రాసేస్తుంటుంది ఆ పత్రిక. తాజాగా జీ -20 సన్నాహక సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని మోడీ క్లాస్‌ తీసుకున్నారంటూ దేశంలోనే ఒక్క ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రమే రాసింది. చివరకు ఈనాడు పత్రిక కూడా ఆ సాహసం చేయలేదు.

షర్మిల విషయంలో జగన్‌ను ప్రధాని మోడీ ప్రశ్నించారన్నది ఆంధ్రజ్యోతి కథనం. సొంత చెల్లిపై కేసీఆర్ ప్రభుత్వం దాడి చేస్తే మౌనంగా ఎందుకు ఉన్నావ్.. ఆమె కారులో ఉండగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తీరు చూసి తనకే బాధేసిందని.. సోదరుడివై ఉండి ఎందుకు ఆ తీరును ప్రశ్నించలేదని మోడీ నిలదీశారన్నది ఆంధ్రజ్యోతి కథనం. ఈ తరహా వార్త మరే పత్రికలో రాలేదు.

ఆంధ్రజ్యోతి తీరు చూస్తుంటే కేసీఆర్‌కు, జగన్‌కు మధ్య వివాదం రాజేయాలన్నట్టుగా ఉంది. షర్మిల బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందన్న విమర్శలకు మరింత బలాన్ని ఇచ్చేలా ఆంధ్రజ్యోతి ప్రచారం ఉంది. తన మతస్తుల ఓట్లు ఎలాగో బీజేపీకి పడవు కాబట్టి.. అవి టీఆర్‌ఎస్‌కు వెళ్లకుండా మధ్యలో చీల్చి పరోక్షంగా కమలం పార్టీకి సాయపడేందుకే షర్మిల బీజేపీ పెద్దల కనుసన్నల్లో రంగంలోకి దిగారన్న ప్రచారమూ ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికను బాగానే విశ్వసిస్తున్న షర్మిలకు ఈ ప్రచారం పెద్ద దెబ్బే. అసలు.. జరుగుతున్నది ఏంటో ఒక్క షర్మిలకు తప్ప అందరికీ తెలుసు. వైఎస్‌ కుమార్తెను కాబట్టి తాను పాదయాత్ర చేస్తూ చేయి ఊపితే చాలు ప్రజలు తనను సీఎంను చేసేస్తారన్న భ్రమల్లో ఆమె కూరుకుపోయారు.

చేస్తున్నది పొద్దుపోని పాదయాత్ర అన్నది సామాన్యులకూ తెలుసు. ఆమె సొంతంగా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కూడా లేదన్నది తెలుసు. ఆ విషయాన్ని పసిగట్టే జగన్‌.. ఆయాసం తప్ప ప్రయోజనం లేదు.. తెలంగాణలో పార్టీ వద్దు అని చెప్పి ఉండవచ్చు. కానీ మాట వినకుండా ముందుకెళ్లి... ఒక ముఖ్యమంత్రిని బూతులు తిడుతూ నడిరోడ్లుపై మాట్లాడి,.. అరెస్ట్‌ అయిన చెల్లిని జగన్‌ కూడా ఎలా వెనుకేసుకు రాగలుగుతారు?. షర్మిల అరెస్ట్‌ను జగన్ ఖండిస్తే ఏపీలో ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లకూ సమాధానం చెప్పుకోవాల్సి రావొచ్చు.

Tags:    
Advertisement

Similar News