మళ్లీ నీట మునిగిన అమరావతి భూములు
సీఆర్‌డీఏ భూములు చెరువులను తలపిస్తున్నాయి. కొట్టేళ్ల వాడు పొంగిపొర్లుతోంది. నీరుకొండ - పెదపరిమి రోడ్లుపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.
Advertisement
అమరావతి భూములు నీట మునిగాయి. భారీ వర్షంతో చెరువులను తలపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి ప్రాంతంలోనూ భారీ వర్షాలు పడ్డాయి. దాంతో రాజధాని సమీప గ్రామాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చింది. సీఆర్‌డీఏ భూములు పూర్తిగా నీట మునిగాయి. సీఆర్‌డీఏ భూములు చెరువులను తలపిస్తున్నాయి. కొట్టేళ్ల వాడు పొంగిపొర్లుతోంది. నీరుకొండ - పెదపరిమి రోడ్లుపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.
ఇప్పటికే అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతమని అధికార పార్టీ వాదిస్తోంది. ఇప్పుడు భారీగా నీరు చేరడంతో మరోసారి అమరావతి ముంపుపై చర్చకు తావిస్తోంది.
Advertisement