ఏపీలో అంబానీ, అదానీ కంపెనీల పెట్టుబడులు..

ఏపీలో రెండు సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని గౌతమ్‌ అదానీ తనయుడు కరణ్‌ అదానీ విశాఖలో ప్రకటించారు. 10 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కడప, నడికుడిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Advertisement
Update:2023-03-03 17:30 IST

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తొలిరోజు.. ఏపీలో పెట్టుబడులపై కీలక ప్రకటలు చేశయి అదానీ, అంబానీ గ్రూప్ లు. హిండెన్ బర్గ్ నివేదికతో గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కొన్ని కాంట్రాక్ట్ లను వెనక్కు తీసుకున్న అదానీ గ్రూపు.. తొలిసారిగా ఏపీలో పెట్టుబడులపై కీలక ప్రకటన చేసింది. ఏపీలో ఇప్పటికే ఓడరేవుల నిర్వహణ చూస్తున్న అదానీ గ్రూప్ త్వరలో సిమెంట్‌ ఫ్యాక్టరీలు, డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఏపీలో రెండు సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని గౌతమ్‌ అదానీ తనయుడు కరణ్‌ అదానీ విశాఖలో ప్రకటించారు. 10 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కడప, నడికుడిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో డేటా సెంటర్‌ నెలకొల్పబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 100 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం, గంగవరం పోర్టులు నిర్వహిస్తున్నామని, రాబోయే ఐదేళ్లలో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో 15వేల మెగావాట్ల పునరుత్పాదక పవర్‌ ప్రాజెక్టులను అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

ఏపీలో 10 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఇప్పటికే ఏపీలో కేజీ డి-6 బేసిన్‌ లో రూ.1.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు ముకేశ్ అంబానీ. ఇక్కడి ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు 30 శాతం మేర దేశీయ అవసరాలను తీరుస్తోందని చెప్పారు. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలిపారు ముకేశ్ అంబానీ. రెండురోజులపాటు విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో.. తొలిరోజు వెలువడిన భారీ ప్రకటనలు ఇవి.

Tags:    
Advertisement

Similar News