ఆయనలా ఉండొద్దు.. పవన్, బాబుకు ప్రకాష్‌రాజ్ సూచన
ఇద్దరితో తనకు చాలాకాలంగా వ్యక్తిగత పరిచయం ఉందన్న ప్రకాష్ రాజ్.. NDAలో చేరిన ఇద్దరూ మోడీలా కాకుండా సెక్యులర్ భావాలు కలిగి ఉంటారని భావిస్తున్నానన్నారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం, జనసేన కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు పార్టీలకు కేంద్రమంత్రి వర్గంలోనూ చోటు దక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీనటుడు ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు పలు సూచనలు చేశారు.
ఎన్నికల్లో విజయం సాధించినందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు అభినందనలు తెలిపారు ప్రకాష్ రాజ్. ఇద్దరితో తనకు చాలాకాలంగా వ్యక్తిగత పరిచయం ఉందన్న ప్రకాష్ రాజ్.. NDAలో చేరిన ఇద్దరూ మోడీలా కాకుండా సెక్యులర్ భావాలు కలిగి ఉంటారని భావిస్తున్నానన్నారు.
జాతీయ రాజకీయాల్లో వచ్చిన అవకాశంతో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేలా చూడాలన్నారు. దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత కూడా పవన్, లచంద్రబాబులపై ఉందన్నారు ప్రకాష్ రాజ్.