‘జైళ్ళు నిండి పోతున్నాయి… బెయిళ్ళ చట్టం తీసుక రండి’

విచారణ ఖైదీలతో దేశంలో జైళ్ళు నిండి పోతున్నాయి. విచారణే లేకుండా, బెయిళ్ళు లేకుండా ఏళ్ళకు ఏళ్ళు అనేక వేల మంది జైళ్ళలో మగ్గుతున్నారు. ఎక్కువ మంది నిరుపేదలు, నిరక్షరాస్యులు, కోర్టులో లాయర్ ను పెట్టుకునే స్తోమత లేనివాళ్ళు, లాయర్ ను పెట్టుకోవాలనే విషయం కూడా తెలియని వాళ్ళు, అసలు వాళ్ళపై మోపబడిన కేసేంటో తెలియని వాళ్ళు, వాళ్ళ కోస‍ం బైట కొట్లాడటానికి మనుషులే లేని వాళ్ళు, ఉన్నా ఎక్కడో కొండల్లో, అడవుల్లో బతకడానికే అష్టకష్టాలుపడుతూ జైలుకొచ్చి కనీసం […]

Advertisement
Update:2022-07-12 10:20 IST

విచారణ ఖైదీలతో దేశంలో జైళ్ళు నిండి పోతున్నాయి. విచారణే లేకుండా, బెయిళ్ళు లేకుండా ఏళ్ళకు ఏళ్ళు అనేక వేల మంది జైళ్ళలో మగ్గుతున్నారు. ఎక్కువ మంది నిరుపేదలు, నిరక్షరాస్యులు, కోర్టులో లాయర్ ను పెట్టుకునే స్తోమత లేనివాళ్ళు, లాయర్ ను పెట్టుకోవాలనే విషయం కూడా తెలియని వాళ్ళు, అసలు వాళ్ళపై మోపబడిన కేసేంటో తెలియని వాళ్ళు, వాళ్ళ కోస‍ం బైట కొట్లాడటానికి మనుషులే లేని వాళ్ళు, ఉన్నా ఎక్కడో కొండల్లో, అడవుల్లో బతకడానికే అష్టకష్టాలుపడుతూ జైలుకొచ్చి కనీసం తమ వాళ్ళను చూసే పరిస్థితే లేనివాళ్ళు…… ఇలా ఒకరేమిటి భారత దేశపు జైళ్ళలో లక్షల మంది అభాగ్యులు ఏండ్లుగా మగ్గిపోతున్నారు. వారి గురించి ఇంత కాలానికి సుప్రీం కోర్టు గొంతు విప్పింది. ‘బెయిల్ అనేది నియమం,జైలు మినహాయింపు’ అని నొక్కిచెప్పింది. ప్రత్యేకంగా బెయిల్ చట్టం తీసుకరావాలని కేంద్రానికి సూచించింది.

ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు చెందిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఎంఎం సుందరేశన్ ల‌తో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో బెయిల్ చట్టం అత్య‌వసరం అని పేర్కొంది.

UK వంటి దేశాల్లో బెయిల్ చట్టాలను ప్రస్తావిస్తూ, “మన దేశంలో కూడా అలాంటి చట్టం అవసరమని మేము విశ్వసిస్తున్నాము. యునైటెడ్ కింగ్‌డమ్ వంటి అనేక ఇతర దేశాలలో చేసినట్లుగా ప్రత్యేకంగా బెయిల్ మంజూరు చేయడానికి ఉద్దేశించిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము” అని ధర్మాసనం పేర్కొంది.

బెయిల్ మంజూరు కోసం ఉండే నిబంధనల్లోని లోపాలను ఎత్తిచూపుతూ, “బెయిల్‌ల మంజూరును క్రమబద్ధీకరించడానికి దేశంలో బెయిల్ చట్టం అవసరం” అని సుప్రీంకోర్టు పేర్కొంది.

తన ఉత్తర్వులో, భారతదేశంలోని జైళ్లు “అండర్ ట్రయల్ ఖైదీలతో నిండిపోయాయి”, వీరిలో ఎక్కువ మంది కాగ్నిజబుల్ నేరం నమోదు చేయబడివాళ్ళే. ఏడేళ్లు, అంతకంటే తక్కువ శిక్షార్హమైన నేరాలకు పాల్పడిన అలాంటి వాళ్ళను అరెస్టు చేయవలసిన అవసరం లేదు” అని సుప్రీం కోర్టు పేర్కొంది. ”.

“జైళ్ళలో ఉన్న చాలామంది పేదలు, నిరక్షరాస్యులు మాత్రమే కాకుండా మహిళలు కూడా ” అని బెంచ్ పేర్కొంది. వలసరాజ్యాల భారతదేశం యొక్క అవశేషాలను, దర్యాప్తు సంస్థలు కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి అరెస్టు అనేది ఒక క్రూరమైన చర్య. దీని ఫలితంగా పౌరుల స్వేచ్ఛను తగ్గించడం, నిరోధించడం జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పోలీసు రాజ్యం అనే ముద్ర పడరాదు. ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకమైనవి అని బెంచ్ పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News