పానీపూరీ బంద్ చేయండి.. అనారోగ్యాలను కొని తెచ్చుకోకండి..

అసలే విషజ్వరాల సీజన్, ఆపై వర్షాలు.. ఇలాంటి టైమ్ లో బయట తిండి కాస్త తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు. పనిలో పనిగా పానీపూరీ లవర్స్ కి కూడా వార్నింగ్ ఇచ్చారాయన. పానీపూరీతో రోగాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. పానీపూరీ, ఔట్ సైడ్ ఫుడ్ తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వాటి జోలికే వెళ్లొద్దన్నారు. కొవిడ్ నామమాత్రం.. కానీ..! దాదాపుగా కొవిడ్ నుంచి బయటపడ్డామని, కొత్త వేరియంట్‌ […]

Advertisement
Update:2022-07-12 09:32 IST

అసలే విషజ్వరాల సీజన్, ఆపై వర్షాలు.. ఇలాంటి టైమ్ లో బయట తిండి కాస్త తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు. పనిలో పనిగా పానీపూరీ లవర్స్ కి కూడా వార్నింగ్ ఇచ్చారాయన. పానీపూరీతో రోగాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. పానీపూరీ, ఔట్ సైడ్ ఫుడ్ తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వాటి జోలికే వెళ్లొద్దన్నారు.

కొవిడ్ నామమాత్రం.. కానీ..!
దాదాపుగా కొవిడ్ నుంచి బయటపడ్డామని, కొత్త వేరియంట్‌ వస్తే తప్ప కొవిడ్‌ కథ ముగిసినట్లేనని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, అది చివ‌రి దశకు చేరుకుందన్నారు. కొవిడ్‌ కూడా ఓ సీజనల్‌ వ్యాధిగా మారిపోయిందని, లక్షణాలుంటే కేవలం 5 రోజులే క్వారంటైన్‌ లో ఉండాలన్నారు. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదన్నారు. డబ్ల్యూహెచ్‌ వో కొత్త నిబంధనల ప్రకారం లక్షణాలు లేనివారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని చెప్పారు. ఇప్పుడిక సీజనల్‌ వ్యాధులతో పోరాడాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు. వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్యాక్టీరియా, వైరస్‌ తో సీజనల్‌ వ్యాధులు వస్తాయని, వర్షాలు పడేసమయంలో అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు.

డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా..
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1184 డెంగ్యూ కేసులు న‌మోద‌య్యాయ‌ని చెప్పారు ఆరోగ్య శాఖ డైరెక్టర్. హైదరాబాద్‌ లో అత్యథికంగా 516, కరీంనగర్‌ లో 84, మహబూబ్‌ నగర్‌, ఇతర ప్రాంతాల్లో మిగతా కేసులు నమోదయ్యాయని చెప్పారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అన్నారు. దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. భద్రాద్రి, ములుగు జిల్లాల నుంచి మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు.

ఈ ఏడాది టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, మేలో 2700, జూన్‌లో 2,752 కేసులు వచ్చాయని వెల్లడించారు. ప్రతి ఫ్రైడే డ్రైడే పాటించాలని, సరైన ఆహారం, మంచినీరు తీసుకోవడం ద్వారా ప్రజలు ఈ వ్యాధుల నుంచి సురక్షితంగా బయటపడొచ్చని చెప్పారు. నీరు రంగుమారితే తప్పకుండా కాచి చల్లార్చి తాగాలన్నారు. గర్భిణులు డెలివరీ డేట్ కంటే ముందే.. ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకోవాలని సూచించారు. బాలింతలు, చంటి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఉండి మాస్క్‌ ధరిస్తూ ఐసోలేషన్‌ పాటించాలని సూచించారు.

అవసరం లేకుండా ప్లేట్‌ లెట్‌ మార్పిడి చేయొద్దని ప్రైవేట్‌ ఆస్పత్రులకు సూచించారు. ప్రజల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవద్దని కోరారు. అత్య‌వ‌స‌రం అయితేనే ప్లేట్‌ లెట్‌ చికిత్స అందించాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News