కేంద్రం ఆదేశాలను లెక్కచేయని అదానీ…ఎవరిని చూసుకొని ఈ ధైర్యం ?

రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా కరోనా సమయంలో విపరీతంగా పెరిగిన ధరలు ఇప్పుడు కూడా తగ్గకపోగా రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్న ఉత్పత్తి దారులు ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత్ లో మాత్రం తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. వీటి ధరలను తగ్గించడం కోస‍ం కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేసన్లకు లేఖ కూడా రాసింది. సోయాబీన్ […]

Advertisement
Update:2022-07-12 04:35 IST

రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా కరోనా సమయంలో విపరీతంగా పెరిగిన ధరలు ఇప్పుడు కూడా తగ్గకపోగా రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్న ఉత్పత్తి దారులు ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత్ లో మాత్రం తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. వీటి ధరలను తగ్గించడం కోస‍ం కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేసన్లకు లేఖ కూడా రాసింది.

సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లకు కేంద్ర ప్రభుత్వ రాసిన లేఖలో ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయని, మీరు కూడా వెంటనే ధరలు తగ్గించాలని కోరింది. లీటర్ కు 15 రూపాయల మేర తగ్గించాలని ఆదేశించింది కేంద్రం.

ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆహార, ప్రజాపంపిణీ శాఖకు తెలుపాలని సూచించింది. ఈ ధరల తగ్గుదల వారంరోజుల లోపే జరగాలని కేంద్రం తన లేఖలో ఆదేశించింది.

కేంద్రం అసోసియేషన్లకు ఈ నెల 6వ తేదీన లేఖ రాసింది. ఆరు రోజులు గడిచి పోయినా అనేక‌ కంపెనీలు తమ ధరలను మాత్రం తగ్గించలేదు. ఇప్పటి వరకు మదర్ డెయిరీ, పార్క్ ఆగ్రో, లిబర్టీ మాత్రమే ధరలను తగ్గించాయి. ముఖ్యంగా అదానీ గ్రూపుకు చెందిన ‘అదానీ విల్మార్’ ధరలను తగ్గించకపోగా కనీసం ఈ విషయంపై స్పందించడం కూడా లేదు. అదానీ అంతటి వాడే తగ్గించనప్పుడు తాము కూడా ఎందుకు తగ్గించాలని అనుకున్న కార్గిల్‌ అండ్‌ అలనా, రుచి సోయా కంపెనీలు కూడా ధరలు తగ్గించడానికి ససేమిరా అంటున్నాయి.

వంటనూనెల ధరలు తగ్గించడానికి కేంద్రం ఇచ్చిన వారం రోజుల సమయం ఈ రోజుతో పూర్తవుతుంది. అదానీ తో సహా మిగతా రెండు కంపెనీలు మాత్రం ఇప్పటికీ స్పందించకపోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ? కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడానికి సిద్దమైనట్టే అనుకోవచ్చా ? అదానీ లాంటి వారికి ఈ ధైర్యం ఎవరి వల్ల వచ్చి ఉంటుంది ?

Tags:    
Advertisement

Similar News