రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిన మోడీ.. అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
ప్రధాని మోడీ రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించారని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆయన ఇంతగా ఫైరవడానికి కారణముంది. నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ ఎంబ్లెమ్ ను మోడీ సోమవారం ఆవిష్కరించారు. కానీ ఈ కార్యక్రమానికి విపక్ష నేతలనెవరినీ ఆహ్వానించలేదు. అయితే ప్రభుత్వ అధినేతగా దీన్ని మోడీ ఆవిష్కరించకుండా ఉండాల్సిందని, ఇది లోక్ సభ స్పీకర్ పరిధి కిందకు వస్తుంది గనుక స్పీకర్ ఆవిష్కరించాలని ఒవైసీ అన్నారు. రాజ్యాంగంలో పార్లమెంటు, ప్రభుత్వం, జుడీషియరీల అధికారాలు […]
ప్రధాని మోడీ రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించారని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆయన ఇంతగా ఫైరవడానికి కారణముంది. నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ ఎంబ్లెమ్ ను మోడీ సోమవారం ఆవిష్కరించారు.
కానీ ఈ కార్యక్రమానికి విపక్ష నేతలనెవరినీ ఆహ్వానించలేదు. అయితే ప్రభుత్వ అధినేతగా దీన్ని మోడీ ఆవిష్కరించకుండా ఉండాల్సిందని, ఇది లోక్ సభ స్పీకర్ పరిధి కిందకు వస్తుంది గనుక స్పీకర్ ఆవిష్కరించాలని ఒవైసీ అన్నారు.
రాజ్యాంగంలో పార్లమెంటు, ప్రభుత్వం, జుడీషియరీల అధికారాలు వేర్వేరుగా ఉంటాయని, ఈ కారణంగా మోడీకి ఈ అధికారం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఇది స్పీకర్ కు గల హక్కు.. స్పీకర్లు ప్రభుత్వానికి సబార్డినేట్లు కారు.
అందువల్ల ఈ ఎంబ్లెమ్ ని ఆవిష్కరించి మోడీ రాజ్యాంగ నియమాల ఉల్లంఘనకు పాల్పడ్డారు అని ఒవైసీ పేర్కొన్నారు. 9,500 కేజీల బరువు, 6.5 మీటర్ల ఎత్తయిన ఈ కాంస్య ఎంబ్లెమ్ ను పార్లమెంట్ కొత్త భవనం మీద అమర్చారు.
ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ పురి ప్రధాని వెంట ఉన్నారు. దీని ఆవిష్కరణ సందర్భంగా మోడీ.. ఈ భవన నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందితో కొద్దిసేపు ముచ్ఛటించారు. ఇక ఒవైసీతో పాటు విపక్ష నేతలు కూడా తమనీ కార్యక్రమానికి ఆహ్వానించనందుకు మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం మంచిదే గానీ పార్లమెంటుకు సంబంధించిన ఈ విధమైన కార్యక్రమాలకు విపక్ష నేతలను సైతం ఆహ్వానించవలసి ఉండిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ ఏ ఒక్క పార్టీకో లేదా ప్రభుత్వానికో లేక ప్రధాన మంత్రికో చెందినది కాదని, ఇది ప్రజాస్వామ్య ఆలయం వంటిదని, ప్రతి ఎంపీకి చెందినదని ఆయన అన్నారు. ఇక కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎనిమిది దశల్లో నిర్మిస్తున్నారు. క్లే మోడలింగ్ నుంచి కంప్యూటర్ గ్రాఫిక్స్, పాలిషింగ్ వంటివాటి వరకు వివిధ దశల్లో ఈ భవనం రూపు దిద్దుకుంటోంది.
ప్రతి భారతీయుడూ ఈ భవనంతో అనుబంధాన్ని పెనవేసుకునేలా రూపొందుతోంది. వేదాల నుంచి యోగా, ఉపనిషద్ ల వరకు, సూఫీ నుంచి జానపద సంస్కృతి వరకు,.. ఇలా ప్రతి అంశం దీని ఇంటీరియర్ సొగసుల్లో కనిపించేలా సిబ్బంది కృషి చేశారు. కమలం, నెమలి, మర్రి చెట్టు మూడు జాతీయ చిహ్నాలుగా మూడు వేర్వేరు థీమ్ లతో ఇవి దేశ జాతీయతను ప్రతిబింబిస్తున్నాయి.
లోక్ సభ ఛాంబర్ కి జాతీయ పక్షి నెమలి థీమ్ కాగా రాజ్యసభ ఛాంబర్ కి జాతీయ పుష్పం కమలాన్ని థీమ్ గా ఎంచుకున్నారు. అలాగే సెంట్రల్ లాంజ్ ప్రాంతం జాతీయ వృక్షం మర్రి చెట్టు.. ఈ థీమ్ కి ‘ప్రాణం’ పోసింది. అంతా బాగానే ఉన్నా.. కొత్త పార్లమెంట్ భవనం పై జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించడమే చేదుగా మారింది. ఇదేదో తమ ప్రభుత్వ సొంత కార్యక్రమంగా ఆయన భావించినట్టు కనబడుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.